ఏడాది నుంచి శృంగారంలో పాల్గొనడం లేదు.. రెండేళ్ల కూతురికి బీర్ పట్టిస్తున్నాడు.. ఎన్నారై భర్తపై కేసు పెట్టిన భార్య

ప్రతీకాత్మక చిత్రం

ఎన్నారై సంబంధం మళ్లీ రాదేమోనన్న భయంతో, అడిగినంత కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లిచేస్తున్నారు. ఎన్నారై అల్లుడు కదా అని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. తీరా భార్యతో సహా తాను ఉండే దేశానికి వెళ్లిన తర్వాత ..

 • Share this:
  ఎన్నారై సంబంధం మోజులో పడి ఎంతో మంది ఇబ్బందుల పాలవుతున్నారు. ఇంత మంచి సంబంధం మళ్లీ రాదేమోనన్న భయంతో, అడిగినంత కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లిచేస్తున్నారు. ఎన్నారై అల్లుడు కదా అని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. తీరా భార్యతో సహా తాను ఉండే దేశానికి వెళ్లిన తర్వాత అసలు రూపాన్ని చూపించడం స్టార్ట్ చేస్తున్నారు. భార్యలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పుట్టింట్లో వదిలేసి ఎస్కేప్ అవుతున్నారు. విదేశీ చట్టాలు, స్వదేశీ చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా తప్పించుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఎన్నారై భర్త చేస్తున్న ఆగడాలను గురించి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. రెండేళ్ల కూతురికి బీరు కూడా బలవంతంగా తాగిస్తున్నాడంటూ వాపోతోంది. గుజరాత్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరం గోటా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 2016వ సంవత్సరంలో ఎన్నారైతో పెళ్లి జరిగింది. 2017వ సంవత్సరంలో ఆ జంట అహ్మదాబాద్ నుంచి దుబాయికి వెళ్లిపోయింది. అప్పటి వరకు బాగానే భార్యను చూసుకున్న భర్త, దుబాయికి వెళ్లిన తర్వాత తన అసలు రూపం చూపించాడు. ఆమెను అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. మద్యం తాగి వచ్చి ప్రతీరోజూ ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించేవాడు. ఫోన్ ను కూడా అందుబాటులో ఉంచేవాడు కాదు. దేశం కాని దేశానికి తీసుకెళ్లి కనీసం తన వాళ్లతో మాట్లాడుకునే స్వేచ్ఛను కూడా కల్పించేవాడు కాదు.
  ఇది కూడా చదవండి: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్

  ఈ ఏడాది మార్చి నెలలో దుబాయి నుంచి ఆమెను భారత్ కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమెను పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో ఆ భార్య అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘భారత్ లో ఉండగా నన్ను బంగారంలాగా చూసుకున్నాడు. ఏమయిందో ఏమో కానీ దుబాయికి వెళ్లిన తర్వాత మాత్రం మారిపోయాడు. నాకు ప్రతిరోజూ నరకం చూపించేవాడు. ఏడాది కాలంగా నాతో శ‌ృంగారంలో పాల్గొనడం లేదు. సంసారం చేయడం లేదు. నాకు అనారోగ్యం వచ్చినా, పాపకు ఆరోగ్యం బాగాలేకున్నా పట్టించుకునేవాడు కాదు. అదనపు కట్నం తెచ్చి ఇస్తేనే కాపురం చేస్తాననీ, మిమ్మల్ని పట్టించుకుంటానని అనేవాడు. నాకు బలవంతంగా బీరు తాగించేవాడు. చివరకు రెండేళ్ల వయసున్న కూతురికి కూడా బలవంతంగా బీరు తాగించాడు‘.. అంటూ ఆ భార్య వాపోయింది. తనకున్యాయం చేయాలని ఆ బాధితురాలు కోరుతోంది.
  ఇది కూడా చదవండి: నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఓ వివాహితతో ఉన్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. పోలీసు శాఖలోనూ కలకలం.. అసలేం జరిగిందంటే..!
  Published by:Hasaan Kandula
  First published: