Woman Sucide : మంచివాడనుకొని ప్రేమించింది. మనసిచ్చినవాడి కోసం కన్నవాళ్లను కాదనుకుంది. ఇంట్లో నుంచి పారిపోయి మరీ ప్రేమించినోడిని పెళ్లి(Marriage) చేసుకుంది. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. పెళ్లి అయిన తర్వాత తెలిసింది ఆ యువతికి తాను చేసిన తప్పు ఏంటని. చివరకు ఆత్మహత్య(Sucide) చేసుకొని చనిపోయింది.
అసలేం జరిగిందంటే
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు చెందిన రీనా అనే యువతి రాజస్తాన్(Rajastan) లోని కోట(Kota) సిటీకి చెందిన కరణ్ సింగ్ అనే యువకుడు ప్రేమిచుకున్నారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి 5 సంవత్సరాల క్రితం, ఇంటి నుండి పారిపోయి ప్రియుడు కరణ్ సింగ్ ని పెళ్లి చేసుకుంది రీనా. ప్రేమ వివాహం తర్వాత కరణ్ సింగ్..అసలు నిజస్వరూపం బయటపడింది. కట్నం కోసం రీనాని వేధించేవాడు. ఇదే సమయంలో పూజ అనే మరో అమ్మాయితో కరణ్ సింగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నీతో కలిసి జీవించడం ఇష్టం లేదు, పూజతోనే జీవితాన్ని గడపాలనుకుంటున్నానని రీనాకు భర్త చెప్పాడు. దీనిని రీనా వ్యతిరేకించగా..పలుసార్లు ఆమెపై భర్త భౌతికదాడులకు పాల్పడ్డాడు. అయితే భర్త ఇతర అమ్మాయితో ప్రేమాయణం సాగించడం,తనను హింసించడంతో రీనా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో శుక్రవారం తన సోదరికి వాట్సాప్ లో ఓ ఆడియో పంపి రీనా తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రీనా తన సోదరికి పంపిన ఆడియోలో..తన మృతికి కారణం భర్త,అతని ప్రియురాలని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో మృతురాలు రీనా సోదరి, తండ్రి సహా మరికొందరు రీనా భర్త, అతని ప్రియురాలిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారు. ప్రేమ వివాహం తర్వాత కరణ్ సింగ్ తరచూ రీనాను కొట్టేవాడని, రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మృతురాలి భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Perfect Life Partner : సుఖంగా ఉండాలంటే..ఫర్ఫెక్ట్ లైఫ్ పార్టనర్ ని ఇలా ఎంచుకోండి
మృతురాలి సోదరి షాలిని మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం తన అక్క రీనా కోటకు చెందిన కరణ్‌సింగ్‌తో వివాహమైందని తెలిపారు. పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా రీనాను అత్తమామలు భర్త వద్దకు పంపలేదు. చాలాసార్లు ఫోన్ చేసి రీనాను ఇంటికి తీసుకురావాలని చెప్పినా అత్తమామలు పట్టించుకోలేదు. చనిపోయే ముందు రీనా తన భర్తకు వేరే అమ్మాయితో ఉన్న అనుబంధం గురించి ఆడియో పంపిందని షాలిని చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.