బ్యూటీపార్లర్‌కి వెళ్లి ప్రియుడితో గడిపిన భార్య... భర్త ప్రశ్నించేసరికి ఏం చేసిందంటే...

బ్యూటీపార్లర్‌కి వెళ్లి ప్రియుడితో గడిపిన భార్య... భర్త ప్రశ్నించేసరికి ఏం చేసిందంటే...

రకరకాల వివాహేతర సంబంధాలు. వాటిలో ఇదొకటి. భార్యపై పెంచుకున్న అనుమానం నిజమైంది. కానీ అది ప్రాణాలపైకి తెస్తుందని అతను ఊహించలేదు. చివరకు ఏం జరిగింది?

 • Share this:
  గుజరాత్... అహ్మదాబాద్‌లో జరిగిన ఘటన ఇది. ఆ భార్యాభర్తలకు కొత్తగా పెళ్లైంది. అయ్యిందేగానీ... రోజూ ఆమెలో ఏదో కోపం. ఎందుకో తెలియని దూరం. ఆమెను "ఎందుకలా ఉంటున్నావు" అని అడిగితే... "ఎలా ఉంటున్నా... బానే ఉంటున్నాగా"... అనేది. ఆమెతో కాపురం సరిగా లేకపోవడంతో... తన క్లోజ్ ఫ్రెండ్‌కి విషయం చెప్పాడు. "ఏదైనా సలహా ఇవ్వరా" అన్నాడు. ఆ ఫ్రెండ్... "నేనోసారి మీ ఇంటికొస్తాను. నీ వైఫ్‌ని చూస్తాను. ఆ తర్వాత నా ఒపీనియన్ చెబుతాను" అన్నాడు. "పెళ్లిలో చూశావుగా" అంటే... "అప్పుడు వేరు... ఇప్పుడు వేరు" అన్నాడు. సరే అన్నాడు. మర్నాడు... ఏదో పని ఉన్నట్లుగా... ఆ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఆమె కాఫీ ఇచ్చింది. తాగాడు. ఆమె వైపు అదోలా చూశాడు. ఆమె పట్టించుకోకుండా వంటగదిలోకి వెళ్లింది.

  మర్నాడు మళ్లీ బయట ఇద్దరూ కలిశారు. "రేయ్... నాకు డౌట్ కొడుతోంది. నీ భార్యకు పెళ్లికి ముందే ఎవడితోనో సంబంధం ఉంది" అన్నాడు. మొదట షాకైనా... అంత లేదులేరా... అలాంటిది ఉంటే... పెళ్లికి ముందే పేరెంట్స్‌కి చెప్పేదిగా అన్నాడు. "నువ్వు నమ్మితే నమ్ము లేదంటే... లేదు... నాకు అలా అనిపించింది" అన్నాడు.

  నాల్రోజుల తర్వాత... ఆమె మధ్యాహ్నం వేళ బ్యూటీపార్లర్‌కి వెళ్లింది. రాత్రి 7 గంటలకు తిరిగొచ్చింది. "బ్యూటీపార్లర్‌లో ఇంతసేపు ఏం చేస్తున్నావ్" అని అడిగితే... "ఎంతసేపు... కాస్త లేటైంది... అంతేగా... దానికే ప్రశ్నిస్తారేంటి" అంటూ కిచెన్ లోకి వెళ్లిపోయింది.

  ఆమెకు తెలియకుండా... ఆమె మొబైల్ చెక్ చేశాడు. అందులో సునీల్ అనే వ్యక్తి నంబర్ ఉంది. ఆ రోజు అతనితో ఆమె మాట్లాడినట్లు కాల్ డేటా ఉంది. "సునీల్ ఎవరు" అని అడిగాడు. కోపంగా చూసింది. "నా ఫ్రెండ్" అంది. "ఫ్రెండంటే" అన్నాడు... "ఫ్రెండంటే ఫ్రెండే... అయినా నా పర్మిషన్ లేకుండా... నా మొబైల్ ఎందుకు చూశారు" అంటూ... వేరే గదిలోకి వెళ్లిపోయింది.

  జరిగిన విషయాన్ని ఆమె సునీల్‌కి చెప్పింది. "మనం పెళ్లి చేసుకుందామనుకుంటే... వాడు మధ్యలో ఎంటరయ్యాడు. మీ ఆయనకు గట్టిగా వార్నింగ్ ఇస్తా" అన్నాడు. అదే మాట ప్రకారం... మర్నాడు ఇంటికొచ్చాడు సునీల్. ఆ సమయంలో... భర్త కుటుంబ సభ్యులు ఆ ఇంటికి వచ్చారు. వాళ్ల ముందే సునీల్... అతనితో గొడవ పెట్టుకున్నాడు. వార్నింగ్ ఇచ్చాడు. గొడవ బాగా పెరిగి... కొట్టుకునే పరిస్థితికి వచ్చేశారు. ఆ క్రమంలో... కత్తి తీసిన సునీల్... కసక్కున పొడవబోతే... భర్త తప్పించుకోగా... అతని నలుగురు అక్కల్లో ఒకరికి కత్తి పొడుచుకుంది. దాంతో... ఆమె ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయింది. కత్తితో పొడిచాక పారిపోయిన సునీల్‌ని రామోల్ పోలీసులు కేసు రాసి పట్టుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
  Published by:Krishna Kumar N
  First published: