Home /News /crime /

AHEAD OF PUNJAB POLLS RAPE CONVICT DERA CHIEF GURMEET RAM RAHIM SINGH ALLOWED TO LEAVE JAIL FOR 21 DAYS MKS

Gurmeet Ram Rahim : వామ్మో! రేపిస్టు డేరా బాబా జైలు నుంచి విడుదల -ఎన్నికల వేళ కలకలం

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ (పాత ఫొటో)

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ (పాత ఫొటో)

డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. భారత నేర చరిత్రలో తనదైన అధ్యయనాలు కలిగిన ఈ రేపిస్టు గురువు మళ్లీ జనం మధ్యంలోకి వచ్చాడు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల వేళ డేరా బాబా బయటికి రావడం కలకలం రేపుతున్నది.

డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. భారత నేర చరిత్రలో తనదైన అధ్యయనాలు కలిగిన ఈ రేపిస్టు గురువు మళ్లీ జనం మధ్యంలోకి వచ్చాడు. ‘డేరా సచ్చా సౌదా’ అనే సిక్కు సంస్థకు అధిపతిగా ఆశ్రమంలో అనేక అక్రమాలకు పాల్పడి, హత్య, అత్యాచార కేసుల్లో దోషిగా తేలి శిక్ష పొందుతోన్న కీచకుడు జైలు నుంచి విడుదలయ్యాడు. సరిగ్గా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానా ప్రభుత్వం డేరా బాబాను విడుదల చేయడం తీవ్రచర్చనీయాంశమైంది. పంజాబ్ లోని పలు అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల డేరా బాబా రీఎంట్రీతో పార్టీల్లో గుబులు మొదలైంది..

తనను తాను భగవంతుడి అవతారంగా చెప్పుకుంటూ ఆ మేరకు సినిమా కూడా తీసి, నిత్య రాసలీలలు, అక్రమాలకు పాల్పడిన ‘డేరా సచ్ఛా సౌధా’ నిర్వాహకుడు, బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ సోమవారం నాడు రోహ్ తక్ లోని సునారియా జైలు నుంచి విడుదలయ్యాడు. హత్య, రేప్ కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షఅనుభవిస్తోన్న డేరా బాబాకు 21 రోజుల సెలవులు మంజూరుచేస్తూ హర్యానాలోని బీజేపీ సర్కార్ ఉత్తర్వులివ్వడంతో విడుదలకు మార్గం సుగమం అయింది.

CM KCR ఆహ్వానాన్ని PM Modi మన్నిస్తారా? -గులాబీ బాసే మనసు మార్చుకుంటారా?



డేరా బాబాపై దాదాపు రెండు దశాబ్దాలుగా నేర ఆరోపణలు ఉండగా, వాటిలో కొన్ని 2014లో నిరూపితం అయ్యాయి. జర్నలిస్ట్ హత్య, ఆశ్రమంలో శిశ్యురాళ్లపై అత్యాచారం ఆరోపణలను సీబీఐ నిరూపించడంతో పంజాబ్-హర్యానా హైకోర్టు గుర్మీత్ రామ్ రహీమ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం రోహ్ తక్ జైలులో శిక్ష అనుభవిస్తోన్న అతను.. మధ్యలో రెండు సార్లు, అది కూడా కొన్ని గంటలపాటు పెరోల్ పై బయటికొచ్చి అనారోగ్యంతో బాధపడుతోన్న తల్లిని చూసెళ్లాడు. అయితే,

Gadwal Bidda: సోషల్ మీడియా సంచలనం ‘గద్వాల బిడ్డ’ ఇకలేడు -నెటిజన్ల దిగ్భ్రాంతి -మీమ్స్ వెల్లువ


జైలు శిక్ష పడిన తర్వాత సుదీర్ఘ సెలవుపై డేరా బాబా బయటికి రావడం ఇదే తొలిసారి. సరిగ్గా పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న సమయంలోనే గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ విడుదల కావడం రాజకీయంగానూ కలకలం రేపుతున్నది. పంజాబ్ లో ఫిబ్రవరి 21న పోలింగ్ జరుగనుండగా, డేరా బాబా విడుదల కీలక పరిణామంగా మారింది.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Dera baba, Haryana, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు