ఉత్తర్ ప్రదేశ్ లోని (Uttar pradesh) ప్రయాగ్ రాజ్ లో షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే.. మేకల వ్యాపారి తన 40 మేకలను ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసికి రవాణాచేస్తున్నాడు. బుధవారం అర్థరాత్రి ట్రాన్స్-గంగా ఏరియాలోని థర్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే నుంచి 40 మేకలతో లోడ్ చేయబడిన పికప్ ట్రక్కును ఎనిమిది మంది గుర్తుతెలియని దుండగులు దోచుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈ జంతువులు స్థానిక మేకల వ్యాపారి మొహమ్మద్ ఇమ్రాన్‌కు చెందినవని గుర్తించారు. ఈద్-ఉల్-అజా లేదా బక్రీద్ పండుగకు ముందు ప్రయాగ్‌రాజ్ నుంచి వారణాసికి రవాణా చేయబడుతున్నాయి.కాగా, ఇమ్రాన్ ఫిర్యాదు మేరకు థర్వాయి పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దోచుకున్న మేకల విలువ సుమారు ₹10 లక్షలు ఉంటుందని ఇమ్రాన్ పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇమ్రాన్ మరియు అతని సహాయకులు పికప్ ట్రక్కులో 40 మేకలను ఎక్కించుకుని వారణాసికి వెళ్లారు. అర్థరాత్రి వారు బస్మహువా గ్రామం సమీపంలో ఉన్నప్పుడు బైక్‌పై వచ్చిన ఎనిమిది మంది దుండగులు వారిని అడ్డగించారు. “దుండగులు ఇమ్రాన్ , అతని సహాయకులను తుపాకీతో బెదిరించారు. వారి నగదు, మొబైల్ మొదలైనవాటిని దోచుకున్నారు. దుండగులు మేకలతో పాటు పికప్ ట్రక్కును తీసుకెళ్లారు. ఈ క్రమంలో షాకింగ్ కు గురైన.. ఇమ్రాన్, ఇతరులు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న టోల్ బూత్‌కు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారని ఎస్పీ ట్రాన్స్-గంగా అభిషేక్ అగర్వాల్ తెలిపారు.
ఇదిలా ఉండగా అమర్ నాథ్ లో (amarnath) కుండపోత వర్షం బీభత్సాన్ని సృష్టించింది.
ఈ క్రమంలో అనుకోని ప్రమాదం వలన ఇప్పటికే పదుల సంఖ్యలో భక్తుల కొండ చరియల కింద శవాలుగా మారారు. మరికొందరి ఆనవాళ్ల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్లు అధికారులు అంచన వేస్తున్నారు. మరో నలభై మంది వరకు గల్లంతయ్యారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Mla Raja singh) కు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
వరదలు (Floods) పెద్ద ఎత్తున ముంచెత్త డానికి కొద్ది సేపటి ముందే రాజాసింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, మంచు శివలింగం దర్శనం కోసం ఆయన అక్కడికి చేరుకున్నారు. కానీవాతావరణం బాగాలేదని, చాపర్ అధికారులు అనుమతించలేదు. సమయంలో రాజాసింగ్ సమీపంలోనే ఉన్నట్లు తెలిసింది.
వరద సంభవించిన ప్రదేశం నుంచి బయటకు వచ్చిన కొన్నినిముషాల్లోనే.. భారీ గావరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. వాతావరణం అనుకూలించక పోవడంతో తాను వెనుతిరిగానని, అన్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. భారీ భద్రతల నడుమ రాజాసింగ్ ను అధికారులు శ్రీనగర్ కు (Srinagar) తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Uttar pradesh