Stoneman Fear: సైకో భయం.. ఫుట్‌పాత్‌పై పడుకున్న వ్యకిపై రాళ్లతో దాడి.. ఎక్కడో కాదు..

ప్రతీకాత్మక చిత్రం

గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో సైకో కిల్లర్ హల్ చల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్థానికులు అతడిని స్టోన్ మ్యాన్‌గా పిలుస్తున్నారు. ఒక సైకో రాళ్లతో దాడి చేస్తూ నగర ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నాడని, అతడి దాడిలో కొంతమంది మరణించారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

  • Share this:
గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో సైకో కిల్లర్ హల్ చల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్థానికులు అతడిని స్టోన్ మ్యాన్‌గా పిలుస్తున్నారు. ఒక సైకో రాళ్లతో దాడి చేస్తూ నగర ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నాడని, అతడి దాడిలో కొంతమంది మరణించారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఉత్తర కోల్‌కతాలోని బీకే పాల్ అవెన్యూలో మంగళవారం రాత్రి ఇలాంటి సంఘటనే జరిగింది. స్థానిక ఓంప్రకాశ్ శర్మ(26) అనే స్థానికుడు రోడ్డుపక్కన హోటల్ నడుపుతున్నాడు. మంగళవారం రాత్రి హోటల్ మూసివేసిన తరువాత, దాని ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. తెల్లవారుజామున అతడిపై ఎవరో రాయితో దాడి చేశారు. బాధితుడి తలపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

1980వ దశకంలో ముంబయి నగరంలో ఇలాంటి సైకో కిల్లరే సంచలనం సృష్టించాడు. అనంతరం 1989లో కోల్‌కతాలోనూ స్టోన్ మ్యాన్ తన ఉనికిని చాటుకున్నాడు. 6 నెలల కాలంలో 13 హత్యలు చేసి అపట్లో పోలీసులకు కునుకు లేకుండా చేశాడు. రోడ్డుపై ఒంటరిగా నిద్రిస్తున్న వారిపై దాదాపు 30 కేజీల బరువున్న రాయిని తలపై మోదేవాడు. ఇదే మాదిరిగా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ కోల్‌కతాలో కేసులు నమోదవుతున్నాయి. ఎవరో వ్యక్తి స్టోన్ మ్యాన్ స్టైల్‌లోనే రాయితో బలంగా కొడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత వరకు ఈ స్టోన్ మ్యాన్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.

ఓ పక్క సైకో కిల్లర్ భయం పీడిస్తుంటే.. ఓం ప్రకాశ్ కు సరైన చికిత్స అందలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. బుధవారం ఉదయం తలపై గాయాన్ని గుర్తించి ఆర్జీ మెడికల్ ఆసుపత్రి తీసుకెళ్లగా.. వాళ్లు చేర్చుకోకుండానే వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. అనంతరం కోల్‌కతా మెడికల్ కాలేజీలో అత్యవసర వార్డులో చేర్పించారు. అయితే వారు తలపై కట్టు మాత్రమే కట్టారని, రోజంతా రోగిని చూసేందుకు ఒక్క డాక్టర్ కూడా రాలేదని చెప్పారు. ఈ విషయంపై సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా.. చివరకు చికిత్స చేసేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు కరోనా టెస్ట్ కోసం సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కు తీసుకెళ్లాయి. అయితే అప్పటికి కొద్ది నిమిషాల్లోనే ఓంప్రకాశ్ మరణించాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఓం ప్రకాశ్ మరణంతో కుటుంబ సభ్యులు బౌబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓం ప్రకాశ్ చనిపోయాడని వారు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బంధువులు శాంతించారు. అయితే చికిత్స చేయలేదనే ఆరోపణను మెడికల్ కాలేజీ అధికారులు ఖండించారు. కోవిడ్ రిపోర్ట్ వచ్చిన ఓ రోజు తర్వాత ఆపరేషన్ చేయాలని నిర్ణయించి, పరిశీలనలో ఉంచామని తెలిపారు.
Published by:Sambasiva Reddy
First published: