యూట్యూబ్ చూసి యువకుడి కిడ్నాప్ స్కెచ్... సినిమా తీయొచ్చు..

యూట్యూబ్ చూసి ఓ యువకుడు యువతిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాడు. అయితే, అతడు వేసిన ప్లాన్ వర్కవుట్ కాలేదు.

news18-telugu
Updated: February 27, 2020, 7:56 PM IST
యూట్యూబ్ చూసి యువకుడి కిడ్నాప్ స్కెచ్... సినిమా తీయొచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యూట్యూబ్ చూసి ఓ యువకుడు యువతిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాడు. అయితే, అతడు వేసిన ప్లాన్ వర్కవుట్ కాలేదు. పోలీసులు అతడికి మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చారు. యువతి కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే ఆమెను కాపాడారు. కడప జిల్లాలో అత్యంత సినీ ఫక్కీలో ఈ సీన్ జరిగింది. కడపలోని ఓ ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కృష్ణమోహన్ ఓ యువతిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాడు. ఆమెను కిడ్నాప్ చేసే సమయంలో ఇంట్లో పెట్రోల్ జల్లాడు. ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లను లీక్ చేశాడు. సిలిండర్ పేలి అందులో యువతి సజీవదహనం అయిపోయి ఉంటుందని అందరూ భావించాలని ప్లాన్ వేశాడు. యువతి చనిపోతే కనీసం ఎముకలు, పుర్రె అయినా మిగులుతాయి కదా అని డౌట్ వచ్చింది. దీంతో శ్మశానంలోకి వెళ్లి ఎముకలు, పుర్రెలు తీసుకొచ్చాడు. ఇంట్లో పుర్రెలు ఉంచాడు. అయితే, అతడి కథ అడ్డం తిరిగింది. యువతి కిడ్నాప్‌నకు గురైందని పోలీసులకు ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే నిందితుడిని, బాధితురాలిని పట్టుకున్నారు. తమిళనాడులోని వేలూరులో వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు ప్లాన్ వేసినట్టు సిలిండర్ పేలి ఉంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం కలిగి ఉండేదని కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. పోలీసులుసకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించారన్నారు. యూట్యూబ్ లో వీడియో చూసి కిడ్నాప్ కు ప్రణాళిక రూపొందించానని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 27, 2020, 7:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading