Home /News /crime /

AFTER SHRIKANT TYAGI ANOTHER BJP NETA CAUGHT ON CAMERA THRASHING EX ARMY MAN IN MADHYA PRADESH REWA VIDEO GOES VIRAL PAH

OMG: రెచ్చిపోయిన పొలిటిషియన్.. మాజీ ఆర్మీ ఉద్యోగిపై పిడిగుద్దులు.. వీడియో వైరల్..

ఆర్మీ ఉద్యోగిపై దాడిచేస్తున్న పొలిటిషియన్

ఆర్మీ ఉద్యోగిపై దాడిచేస్తున్న పొలిటిషియన్

Madhya pradesh: పొలిటిషియన్, మాజీ ఆర్మీ ఉద్యోగి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లి ఇష్టమోచ్చినట్లు కొట్టాడు. అంతటితో ఆగకుండా.. నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Madhya Pradesh, India
కొంత మంది రాజకీయ నాయకులు తమ హోదాను, అధికారాన్ని ఉపయోగించుకుని అత్యంత నీచంగా ప్రవర్తిస్తుంటారు. అమాయకులను బెదిరింపులకు గురిచేస్తూ.. తమ పనులను చేసుకుంటారు. తాముచెప్పిందే వేదమని, తమదే నడవాలని దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో.. కొన్నిసార్లు.. రాజకీయా నాయకులకు వ్యతిరేకంగా అమాయకులు తిరగబడుతుంటారు. దీంతో వాగ్వాదాలు, కొన్నిసార్లు గొడవలు, హత్యలవరకు కూడా వెళ్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్యప్రదేశ్ లోని (Madhya pradesh)  రేవా లో దారుణ ఘటన జరిగింది. స్థానిక పొలిటిషియన్ అయిన రితురాజ్ చతుర్వేది..తన స్నేహితులతో కలిసి మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన దినేష్ మిశ్రా దుకాణంలోనికి చొరబడ్డాడు. అంతేకాకుండా.. అతడిని నోటికొచ్చినట్లు కొడుతూ, ఇష్టమోచ్చినట్లు పిడిగిద్దులు కురిపించాడు. దినేష్ మిశ్రా ఈ ఘటనతో షాకింగ్ లో ఉండిపోయాడు. అతను కిందకు పడిపోయిన ఏమాత్రం.. కనికరం కూడా లేకుండా ఇష్టమోచ్చినట్లు ప్రవర్తించాడు. షాపులో వస్తువులను చిందరవందరగా పారేశాడు. అక్కడ ఉన్న డబ్బులను తీసుకెళ్లిపోయారు.





షాపు నిర్వాహకుడితో ఉన్న పాత వివాదం కారణంగా ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. షాకింగ్ కు గురౌతున్నారు. ఈ ఘటన వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఘటనపై వెంటనే సమగ్ర విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలో.. తన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదని దినేష్ మిశ్రా చెప్పారు. కొందరు పోలీసు సిబ్బంది అక్కడ ఉన్నారని, అయితే జోక్యం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. వీడియో ఆన్‌లైన్‌లో కనిపించిన తర్వాతే పోలీసులు చర్యలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ వీడియోపై బీజేపీ రేవా జిల్లా అధ్యక్షుడు అజయ్ సింగ్ స్పందిస్తూ, దాడి కేసులో అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Madhya pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు