news18-telugu
Updated: November 5, 2020, 7:46 AM IST
ప్రతీకాత్మక చిత్రం
మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఓ బీజేపీ నేత కూడా ఉన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మథురకు 20 కి.మీ దూరంలో ఉన్న గోవర్దన్-బార్సానా రోడ్డులో చోటుచేసుకుంది. ఇటీవల మథురలోని ఓ దేవాయలం పరిసరాల్లో కొందరు వ్యక్తులు నమాజ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫైసల్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్చ చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. అయితే తాము ఆలయ అర్చకుడి అనుమతితోనే అక్కడ నమాజ్ చేసినట్టు నిందితుడు తరఫు వ్యక్తులు తెలిపారు. ఇలా వరుస ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరైనా మతపరమైన ఉద్రిక్తతలు, గందరగోళాన్ని సృష్టించడానికి యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివరాలు.. మసీదులో హనుమాన్ చాలీసా పఠించిన వీడియోను బీజేపీ నేత మనుపాల్ బాన్సాల్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో స్థానిక పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై ఎస్పీ అభిషేక్ సింగ్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. బాన్సాల్ తరుచూ మసీదుకు వెళతడాని మాస్క్ పెద్ద మాల్వీ అలీ హస్సన్ అనుమతితోనే ప్రార్థనలు చేసినట్టు చెప్పారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కూడా అలీ హస్సన్ కూడా ఇదే విషయాన్నిస్పష్టం చేశారు. హిందువుల ప్రార్థనలు చేసేందుకు తానే బాన్సాల్ను అనుమతించినట్టు తెలిపారు. అలా చేయడంలో తప్పేమీ లేదని అన్నారు. సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇదే విషయంపై బాన్సాల్ మాట్లాడుతూ.. హస్సన్ అనుమతితోనే మసీదులో హిందూ ప్రార్థనలు చేసినట్టు చెప్పాడు. హనుమాన్ చాలీసాతో పాటు గాయత్రి మంత్రం పఠించినట్టు తెలిపాడు.
Published by:
Sumanth Kanukula
First published:
November 5, 2020, 7:46 AM IST