AFTER KILLING A FRIEND HE MADE OUT A RELATION WITH HIS WIFE SHOCKING CRIME STORY FROM RAJASTHAN SK ABH
స్నేహితుడిని దారుణంగా హత్య చేసి.. అతని భార్యతో కాపురం.. ఆ తర్వాత ఏమైందంటే?
ప్రతీకాత్మకచిత్రం
సతీష్‌కి గజేంద్ర భార్య మిథిలేష్‌తో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సతీష్ యాదవ్, మిథిలేష్ కలిసి.. ఆమె భర్త గజేంద్ర చేత ఫుల్లుగా మద్యం తాగించి, కారులోకి ఎక్కించి ఆ కారును కాలువలోకి తోసేశారు.
మూడు ముళ్ళు ఏడు అడుగులు అగ్నిసాక్షిగా కడదాకా భర్తతో ఉంటానని భార్య చేసిన ప్రమాణం మర్చిపోయింది. ప్రేమ మోజులో భర్త స్నేహితుడికి దగ్గర అయింది. ఈ క్రమంలో భార్య.. భర్త స్నేహితుడితో కలిసి భర్తను హతమార్చింది. ఈ తర్వాత ప్రియుడి చేతిలో ఆమె కూడా చనిపోయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలోని ఉస్రాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక కాలువలో ఇటీవల ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆ మహిళ రాజస్థాన్‌కు చెందిన మిథిలేష్గా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మిథిలేష్‌ను ఆమె ప్రియుడు హత్య చేశాడు. మృతురాలి ప్రేమికుడు పేరు సతీష్. అతడు ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటావా సమీపంలోని ఉస్రాహార్ అతడి స్వస్థలం. ఆ మహిళ రెండేళ్లుగా సతీష్‌తో కలసి ఉంటోంది. అయితే రెండేళ్ల క్రితం ఆ మహిళ, పిల్లలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
మిథిలేష్ భర్త గజేంద్ర, సతీష్ ఇద్దరూ ఓ ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవర్లు. గజేంద్ర అనే యువకుడు తన భార్య మిథిలేష్‌తో కలిసి నోయిడాలో గతంలో నివసించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత సతీష్‌కి గజేంద్ర భార్య మిథిలేష్‌తో సంబంధం ఏర్పడింది. ఈ నేపధ్యంలో సతీష్ యాదవ్, మిథిలేష్ కలిసి.. ఆమె భర్త గజేంద్ర చేత ఫుల్లుగా మద్యం తాగించి, కారులోకి ఎక్కించి ఆ కారును కాలువలోకి తోసేశారు. కాగా గజేంద్ర మృతదేహాన్ని సైఫాయ్ ఎయిర్‌స్ట్రిప్ సమీపంలోని కాలువ నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, పోస్ట్‌మార్టంలో గజేంద్ర కాలువలో మునిగిపోవడం వల్ల మరణించాడని తేలింది.
గజేంద్ర భార్య మిథిలేష్ రెండు నెలల పాటు రాజస్థాన్‌లోని జుంజునులో ఉన్న తన అత్తమామల ఇంటికి వెళ్లింది. కుటుంబ సభ్యులకు, పిల్లలకు తెలియజేయకుండా అక్కడి నుంచి సతీష్‌తో కలిసి ఇటావాకు చేరుకుంది. అప్పటి నుంచి సతీష్, మిథిలేష్ భార్యాభర్తలుగా జీవించడం ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత మిథిలేష్‌కి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని సతీష్ అనుమానించాడు. దీంతో సతీష్ పూజల సాకుతో మిథిలేష్‌ను అడవిలోకి తీసుకెళ్లి ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆ మృతదేహాన్ని కాలువలో పడేశాడు. కేసును విచారణలో భాగంగా పోలీసులు నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుని దగ్గర పిస్తోల్, హత్యకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.