Rajasthan Gang rape: రాజస్థాన్ లో మైనర్లపై గ్యాంగ్ రేప్.. మూడు రోజుల నరకయాతన

Minors Gang raped: దేశంలో ఏ మూలకెళ్లినా మహిళలకు రక్షణ కరువవుతున్నది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ ఘటన మరువకముందే మరో రెండు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

news18
Updated: October 1, 2020, 10:48 AM IST
Rajasthan Gang rape: రాజస్థాన్ లో మైనర్లపై గ్యాంగ్ రేప్.. మూడు రోజుల నరకయాతన
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 1, 2020, 10:48 AM IST
  • Share this:
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత యువతి చితిమంటలు ఆరకముందే.. దేశంలో మరో రెండు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. యూపీలోని బలరాంపూర్ లో దళిత యువతి సామూహిక లైంగికదాడి, మృతితో పాటు రాజస్థాన్ లో ఇద్దరు మైనర్లపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బరాన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలను అపహరించి తీసుకెళ్లిన దుండగులు.. మూడు రోజుల పాటు వారిని రేప్ చేసినట్టు బాధితుల తండ్రి కేసు పెట్టాడు. ఇద్దరు బాలికల వయస్సు ఒకరికి 13 సంవత్సరాలు కాగా మరోకరికి 15 ఏండ్లు.

సెప్టెంబర్ 18న బరాన్ నుంచి ఇద్దరు మైనర్లను తీసుకెళ్లిన దుండగులు.. వారిని జైపూర్, కోటాకు తీసుకెళ్లి అక్కడ వారికి మత్తు పదార్థాలు ఇచ్చి.. మూడు రోజుల పాటు దాదాపు ఐదుగురు వ్యక్తులు వారిని రేప్ చేశారని వాళ్ల తండ్రి ఆరోపిస్తున్నాడు.

గత నెల 18న ఆ మైనర్లు తప్పిపోగా.. 21 న వారిని కోటాకు సమీపంలో పోలీసులు గుర్తించారు. వారిని విచారించగా.. తమకు ఎవరో మత్తు పదార్థాలు ఇచ్చారనీ, తర్వాత గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని వారు చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 1, 2020, 10:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading