Home /News /crime /

AFTER GIRL REFUSES TO SEXUAL FAVOUR 24 YEAR OLD YOUTH THREATENS HER TO SHARE PHOTOGRAPHS IN SOCIAL MEDIA MS

ఆ పనికి ఒప్పుకుంటావా..? లేక ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టనా..? యువతికి కీచక ప్రేమికుడి వేధింపులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాలేజీ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి ఆ పై తానే బ్రేక్ అప్ చెప్పి చివరికి తనతో సెక్స్ చేయకుంటే అంతకుముందు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు.

  • News18
  • Last Updated :
    సోషల్ మీడియాలో పరిచయాలు.. ఆపై ఇద్దరి మధ్య స్నేహం.. ఆ స్నేహం ప్రేమగా మారడం.. కొద్ది రోజుల తర్వాత బ్రేక్ అప్.. కట్ చేస్తే తాము చెప్పిన పనికి ఒప్పుకోకుంటే వారు కలిసున్న సమయంలో తీసుకున్న ఫోటోలు బయటపెడతానని బెదిరింపులు.. డబ్బులు కావాలని, లేదంటే తనతో శృంగారంలో పాల్గొనాలని వేధింపులు.. క్లుప్తంగా నేటి కాలం ప్రేమ ఇది. ఈ దారుణాలకు యువతులు బలౌతున్నారు.

    ఆకర్షణను ప్రేమగా భావించి.. ఆ పై వారితో ఉన్న చనువు వారి కొంప ముంచుతున్నది. తాజాగా ఒక యువకుడు.. కాలేజీ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి ఆ పై తానే బ్రేక్ అప్ చెప్పి చివరికి తనతో సెక్స్ చేయకుంటే అంతకుముందు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు.

    ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి. తమిళనాడులో చోటు చేసుకుందీ ఘటన. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల కార్తీ నిరుద్యోగి. ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఇదే క్రమంలో అతడి మిత్రులు వాట్సాప్ లో ఒక గ్రూపు క్రియేట్ చేసి అందులో కార్తీని జాయిన్ చేశారు. అయితే అదే గ్రూపులో ఉన్న పుదుచ్చేరి యువతితో స్నేహం చేశాడు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురు కలిసి పుదుచ్చేరి, తమిళనాడు, కేరళలో ఉన్న పలు ప్రదేశాలను తిరిగారు.

    కాగా ఉన్నట్టుండి కార్తీ ఆ యువతితో రిలేషన్ షిప్ కట్ చేశాడు. ఆ పై తనతో శృంగారంలో పాల్గొనాలని, తనకు అవసరమున్నప్పుడల్లా డబ్బులివ్వాలని ఆమెను బెదిరించాడు. దీంతో భయపడ్డ ఆ యువతి.. కార్తీకి పలు మార్లు రూ. 20 వేల దాకా ముట్టజెప్పింది. అయితే తనకు మరో రూ. 50 వేలతో పాటు సెక్స్ కూడా కావాలని.. తనతో సెక్స్ చేయకుంటే వాళ్లిద్దరూ కలిసి దిగిన ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాతో పాటు. ఆ యువతి తల్లి, తండ్రి, చెల్లెకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో విసిగిపోయిన ఆ యువతి.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు కార్తీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నది.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Crime, Crime news, Love, Love cheating, Lovers, Puducherry, Social Media, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు