Home /News /crime /

AFTER FATHER SCOLDING GIRL FROM MAHABUBNAGAR DISTRICT COMMITS SUICIDE IN TELANGANA SRD

Telangana: ఫోన్ లో అతనితో మాట్లాడవద్దన్నందుకు..ఎంత పనిచేశావు తల్లి..కాసేపు ఆలోచించి ఉంటే..

ఫోన్ లో అతనితో మాట్లాడవద్దన్నందుకు..ఎంత పనిచేశావు తల్లి..కాసేపు ఆలోచించి ఉంటే..

ఫోన్ లో అతనితో మాట్లాడవద్దన్నందుకు..ఎంత పనిచేశావు తల్లి..కాసేపు ఆలోచించి ఉంటే..

Telangana: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లలో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ అయినా ఉపయోగిస్తున్నాం. అయితే ఫోన్ ద్వారా ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. దీని వల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయ్.

ఇంకా చదవండి ...
    ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లలో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ అయినా ఉపయోగిస్తున్నాం. అయితే ఫోన్ ద్వారా ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. దీని వల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయ్. ఇలాంటి దారుణమే వనపర్తి జిల్లా చిన్న బావి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. వనపర్తి జిల్లా చిన్న బావి మండలంలోని అయ్యవారిపల్లికి చెందిన బొక్కలమ్మ, కురుమయ్య దంపతులకు కూతురు భువనేశ్వరి (16), కుమారులు అక్షయ కుమార్‌,హేమంత్‌ ఉన్నారు. కూతురు భువనేశ్వరి గత ఏడాది పదో తరగతి పాసైంది. పదోతరగతి పాసైనా ఇంటి వద్దే ఉంటుంది. అయితే, నిన్న సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఫోన్ లో మాట్లాతుండటం..అతనితో ఛాటింగ్ చేయడాన్ని ఆమె పెద్ద తమ్ముడు చూశాడు. చూసిన వెంటనే ఈ విషయమూ తండ్రికి తెలిపాడు.

    ఈ విషయం తెలిసిన భువనేశ్వరి తండ్రి కురుమయ్య ఆమెను మందలించాడు. వయసులో ఉన్న పిల్ల ఇలా చేయడం తగదని మందలించాడు. ఇలాంటివి పునరావృతం అయితే..సహించనని హెచ్చరించాడు. తండ్రి మాటలతో భువనేశ్వరి మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు..తమ్ముళ్లు నిద్రిస్తోన్న సమయంలో.. అదే అర్థరాత్రి పురుగుల మందు తాగింది.
    ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కొల్లపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచింది. ఈ సంఘటనతో ఆ కుటుంబలో విషాదఛాయలు అలుముకున్నాయి. తనను తిట్టింది తండ్రే కదా అని ఆలోచించి ఉంటే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని.. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Crime news, Mahabubnagar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు