హోమ్ /వార్తలు /క్రైమ్ /

Newly Married: ఆరు నెలల క్రితం హ్యాపీగా లవ్ మ్యారేజ్.. కానీ.. ఆమె పుట్టినరోజు జరుపుకున్న మరుసటి రోజే..

Newly Married: ఆరు నెలల క్రితం హ్యాపీగా లవ్ మ్యారేజ్.. కానీ.. ఆమె పుట్టినరోజు జరుపుకున్న మరుసటి రోజే..

సింధుజ, రంజిత్ పెళ్లి ఫొటో

సింధుజ, రంజిత్ పెళ్లి ఫొటో

తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో ఆరు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతి అత్తారింట్లో ఉరికి వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

  నమక్కల్: తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో ఆరు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతి అత్తారింట్లో ఉరికి వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పైగా.. ఆమె పుట్టిన రోజు జరుపుకున్న మరుసటి రోజే ఆ వివాహిత చనిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నమక్కల్ జిల్లాలోని తూసూరు గ్రామానికి చెందిన రంజిత్(19), సింధుజ(18) రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. ఆరు నెలల క్రితం ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. రంజిత్ కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేస్తుండేవాడు. సింధుజకు అక్టోబర్ 27న 17 ఏళ్లు నిండి 18వ సంవత్సరం వచ్చింది. అత్తింట్లో పుట్టినరోజు సంతోషంగా జరుపుకుంది. ఏమైందో తెలియదు గానీ మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ సింధుజ విగత జీవిగా కనిపించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడి చనిపోయిందని అత్తింటి వాళ్లు అంటుంటే.. తన భర్త, అతని కుటుంబం వేధింపులకు గురిచేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సింధుజ కుటుంబం ఆరోపిస్తోంది.

  ఇది కూడా చదవండి: Father and Daughter: ఏం పనులివి.. ఈ తండ్రీకూతురు ఏం చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారో తెలిస్తే...

  సింధుజ మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం నమక్కల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె తలపై, భుజంపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం సింధుజ మృతిపై నెలకొన్న సందేహాలకు సమాధానం దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సింధుజ చనిపోయిన విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున నమక్కల్ ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆమె భర్తను, అత్తమామలను అరెస్ట్ చేయాలని ధర్నాకు దిగారు. నమక్కల్ పోలీసులు ఈ కేసు గురించి మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని.. భార్యాభర్తల మధ్య పెళ్లయిన ఈ ఆరు నెలల సమయంలో ఏమైనా గొడవలు జరిగాయా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నామని చెప్పారు.

  ఇది కూడా చదవండి: Shameful Incident: కూతురు 9 నెలల నిండు గర్భంతో పుట్టింట్లో ఉంటే ఒక తల్లి చేయాల్సిన పనా ఇది..

  అయితే.. సింధుజ ఆత్మహత్య చేసుకుని చనిపోలేదని, ఆమెది కచ్చితంగా హత్యేనని ఆమె భర్త, అత్తమామలపై సింధుజ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నమక్కల్ పోలీసులు రంజిత్ కుమార్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సింధుజ భర్తను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పుట్టిన రోజు చేసుకున్న మరుసటి రోజే కూతురి ప్రాణాలు గాల్లో కలిసి పోవడంతో సింధుజ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని, కట్నం కోసం వేధించి చంపేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రంజిత్‌ను ఇష్టంగా పెళ్లి చేసుకున్న సింధుజ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది లేక ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లుగా ఆమెను నిజంగానే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే విషయం తేలాలంటే పోలీసు విచారణ పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. విచారణలో నిజానిజాలు తేలాల్సి ఉంది.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Love marriage, Lovers, Newly Couple, Wife suicide

  ఉత్తమ కథలు