కూతురు ప్రియుడితో వెళ్లిపోయిందని.. తల్లి ఎంత ఘోరానికి పాల్పడిందంటే..

కూతురు చేసిన పనికి పరువు పోయిందని భావించిన తల్లి.. మనువడు ప్రజ్వల్‌తో కలిసి ఆత్మహత్యకు యత్నించింది.సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి.. ప్రజ్వల్ కాళ్లు చేతులు కట్టేసి అందులో తోసేసింది.

news18-telugu
Updated: September 25, 2019, 9:03 AM IST
కూతురు ప్రియుడితో వెళ్లిపోయిందని.. తల్లి ఎంత ఘోరానికి పాల్పడిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన కూతురు ప్రియుడితో వెళ్లిపోయిందన్న కారణంతో మనస్తాపం చెందిన ఓ తల్లి.. మనువడితో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. మొదట బాలుడిని కాళ్లు చేతులు కట్టి చెరువులో పారేయగా.. అతను మృతి చెందాడు.ఆపై ఆమె కూడా చెరువులో దూకేందుకు యత్నించగా స్థానికులు రక్షించారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని స్టేషన్‌కు తరలించడంతో అసలు విషయం బయటపెట్టింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మండ్యా జిల్లా కేఆర్ పేటకు చెందిన సావిత్రమ్మకు లక్ష్మి అనే కూతురు ఉంది. లక్ష్మికి కుమారుడు ప్రజ్వల్(11) ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం లక్ష్మి భర్త చనిపోవడంతో.. ఆ ఇంట్లో ముగ్గురే ఉంటున్నారు. ఇదే క్రమంలో లక్ష్మికి ఓ వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది.ఆ తర్వాత కొద్దిరోజులకు ప్రియుని వద్దకే వెళ్లిపోయింది.

అయితే కూతురు చేసిన పనికి పరువు పోయిందని భావించిన తల్లి.. మనువడు ప్రజ్వల్‌తో కలిసి ఆత్మహత్యకు యత్నించింది.సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి.. ప్రజ్వల్ కాళ్లు చేతులు కట్టేసి అందులో తోసేసింది. ఆపై తాను కూడా అందులో దూకేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు.. ఈ విషయం తెలిసిన లక్ష్మి దీని వెనకాల తన కొడుకునే చంపాలనే కుట్ర దాగుందని ఆరోపించారు.దర్యాప్తులో నిజానిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు