హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఐఐటీ బాంబే వర్సీటీలో షాకింగ్ ఘటన.. హాస్టల్ వాష్ రూమ్ లో యువతిని వీడియో తీసిన వర్కర్.. ఎక్కడంటే..

ఐఐటీ బాంబే వర్సీటీలో షాకింగ్ ఘటన.. హాస్టల్ వాష్ రూమ్ లో యువతిని వీడియో తీసిన వర్కర్.. ఎక్కడంటే..

 బాంబే ఐఐటీ వర్సీటి

బాంబే ఐఐటీ వర్సీటి

Bombay IIT:  ప్రతిష్టాత్మకమైన బాంబే ఐఐటీ వర్సీటిలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక యువతి తన హాస్టల్ వాష్ రూమ్ లో సెల్ ఫోన్ తో రికార్డు చేయడం గమనించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

దేశంలో యువతులపై అభ్యంతరకర వీడియోలపై తీవ్ర దుమారం కొనసాగుతుంది. రెండు రోజుల క్రితమే చంఢీగఢ్ యూనివర్సీటిలో అమ్మాయిల హస్టల్ లో ఒక యువతి, తన తోటి రూమ్ మేట్ లు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి, సిమ్లాలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ కు పంపింది. ఈ ఘటనపై దేశంలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మరో ప్రతిష్టాత్మక యూనివర్షీటిలో ఇలాంటి ఘటన జరిగింది.

బాంబే ఐఐటీ కు చెందిన హాస్టల్ లో ఒక యువతి వాష్ రూమ్ లో క్యాంటీన్ వర్కర్ రహస్యంగా వీడియో తీస్తుండటాన్ని యువతి గమనించింది. వెంటనే కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వెంటనే యూనివర్సీటి డీన్, పోలీసులతో సహా రంగంలోనికి దిగి ఘటనపై ఆరా తీశారు. వెంటనే .. క్యాంటిన్ ను నడుపుతున్న వారిని పోలీసులు అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితమే.. చంఢీగడ్ క్యాంపస్ అంతా ఉద్రిక్తంగా మారిపోయింది. వందలాది మంది యువతులు బయటకు వచ్చి తమ నిరసన తెలిపారు. తమ వీడియో లు అసభ్య వెబ్ సైట్ లో పోస్ట్ చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చంఢీగఢ్ ప్రభుత్వం ఇప్పటికే మహిళా అధికారులతో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ చేపట్టి నివేదికవచ్చాక నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా పంజాబ్‌ (Punjab)లోని చండీగఢ్ యూనివర్సిటీ (Chandigarh University)లో తీవ్ర కలకలం రేగింది.

బాలికల హాస్టల్‌లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఓ యువతి వీడియో తీసింది. వాటిని తన బాయ్ ఫ్రెండ్‌కి పంపించడంతో.. అతడు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. తమ వీడియో పోర్న్ సైట్లలో ప్రత్యక్షం కావడంతో.. ఆ విద్యార్థినులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అవమాన భారంతో ఒకేసారి 8 మంది విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వర్సిటీలో ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు (Students Protest) చేస్తున్నారు.

మొహాలీ (Mohali)లోని చండీగఢ్ యూనివర్శిటీలో శనివారం ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాలికల హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా.. మరో యువతి వీడియో తీసింది. ఒక్కరు కాదు.. ఇద్దరివి కాదు.. ఏకంగా 60 మంది అమ్మాయిల స్నానం వీడియోలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించింది. వాటిని సిమ్లాలో ఉండే ఓ యువకుడికి పంపించింది. అతడు వాటి సోషల్ మీడియో పోస్ట్ చేసి వైరల్ చేశాడు. పోర్న్ సైట్లలోనూ అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియోల గురించి విద్యార్థినులకు తెలియడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇంటర్నెట్‌లో వీడియోలు చూసి వణికిపోయారు. తమ పరువు పోయిందని ఎంతో కుంగిపోయారు. ఈ క్రమంలోనే ఆత్మాహత్యాయత్నం చేశారు. ఎనిమింది మంది విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేశారని యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment on women, IIT Bombay

ఉత్తమ కథలు