అప్పటిదాకా ప్రేమికుడిలా బిల్డప్ ఇచ్చిన ఆ 23 ఏళ్ల యువకుడి నిజస్వరూపం తాజాగా బయటపడింది. అహ్మదాబాద్... గాంధీనగర్‌లో అభిషేక్ శర్మ... ఓ ప్రైవేట్ సంస్థలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆనంద్‌లో మెడిసిన్ చదువుతున్న ఓ యువతి వెంట పడ్డాడు. నువ్వే నా ప్రాణం అన్నాడు. అతని మాయమాటలు నమ్మిన ఆ యువతి... అతనిది నిజమైన ప్రేమ అనుకుంది. తను కూడా కమిట్ అయ్యింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరిగారు. గుజరాత్‌లోని టూరిజం ప్లేసులన్నీ కవర్ చేసేశారు. ప్రేమ బంధం మరింత బలపడింది. ఇంతలో ఓ రోజు ఆమె... వేరే యువకుడితో మాట్లాడుతూ కనిపించింది. ఆ మాత్రం దానికే అభిషేక్ తట్టుకోలేకపోయాడు. ఆ కుర్రాడెవడు, నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటూ అనుమానపు ప్రశ్నలు వేస్తుంటే... ఆమెకు ఒళ్లు మండింది. కోపంలో బ్రేకప్ చెప్పింది. అంతే... తట్టుకోలేకపోయిన అభిషేక్... ఆమెపై పగబట్టాడు.
అభిషేక్ మరింత రెచ్చిపోయాడు. ఈసారి ఆమె ఫొటోలను... పోర్న్ ఫొటోలుగా మార్ఫింగ్ చేసి... ఆమె వాట్సాప్ అకౌంట్‌తోపాటూ... కొన్ని పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడు. ఆ విషయం ఆమెకు చెప్పి... ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. తిన్నగా వెళ్లి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) అడ్రెస్ ద్వారా అభిషేక్ అరాచకాన్ని ఆధారాలతో సహా కనిపెట్టిన పోలీసులు... అభిషేక్‌ని అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి :
లవర్‌ని ఏటీఎం కార్డులా వాడుకుని పరారైన ప్రియుడు.. కోపంతో ప్రియురాలు..
టార్గెట్ కేసీఆర్... చంద్రబాబు ప్లాన్ అదేనా... 40 రోజుల్లో ఏం చెయ్యబోతున్నారంటే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Harassment on women, Police, RAPE