#జర భద్రం: మొన్న బ్లూవేల్... నిన్న మోమో... ఇప్పుడు 'ఒలీవియా'.!

పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీపై ఓ కన్నేసి ఉంచాలని, అపరిచితులు స్నేహం పేరుతో మాటలు కలిపితే ఆ నెంబర్లను బ్లాక్ చేయాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పోలీసులు.

news18-telugu
Updated: September 26, 2018, 3:32 PM IST
#జర భద్రం: మొన్న బ్లూవేల్... నిన్న మోమో... ఇప్పుడు 'ఒలీవియా'.!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తల్లిదండ్రులూ జాగ్రత్త..! మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్లల్లో ఏం చేస్తున్నారో ఓసారి గమనించండి. వాట్సప్‌లో ఎవరెవరితో ఛాట్‌ చేస్తున్నారో? ఏమేం మాట్లాడుతున్నారో చూస్తూ ఉండండి. ఎందుకంటే శతృవులు ఎక్కడో లేరు. వాట్సప్‌లోనే మీ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో బ్లూవేల్ గేమ్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత మోమో ఛాలెంజ్‌ కూడా అలాగే భయాందోళనలు సృష్టించింది. ఇప్పుడు 'ఒలీవియా' ముప్పు పొంచి ఉంది.

'ఒలీవియా'... ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న పేరు. 'ఒలీవియా' పేరుతో వాట్సప్‌లో ఓ మెసేజ్ వస్తుంది. తనను గుర్తు పట్టలేదా అంటూ అవతలి వ్యక్తి మాటలు కలుపుతుంటారు. పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. మనం కలిసి దిగిన ఫోటో పంపిస్తానంటూ ఓ లింక్ షేర్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే ఓ పోర్న్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా యువతను పోర్న్ ఉచ్చులోకి లాగుతున్నారు సైబర్ నేరగాళ్లు.


'ఒలీవియా' పేరుతో జరిగిన ఛాటింగ్ స్క్రీన్‌షాట్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పోలీసులు సైతం ఈ స్క్రీన్ షాట్స్ ఆధారంగా తల్లిదండ్రుల్ని హెచ్చరిస్తున్నారు. ఒడిషా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవల ఓ ట్వీట్ చూడా చేశారు. పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీపై ఓ కన్నేసి ఉంచాలని, అపరిచితులు స్నేహం పేరుతో మాటలు కలిపితే ఆ నెంబర్లను బ్లాక్ చేయాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

ఆ ఛాటింగ్‌లో వచ్చే లింక్ క్లిక్ చేస్తే పోర్న్ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. అందులో నగ్న చిత్రాలు, లైంగిక చర్యలకు సంబంధించిన వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ మోసానికి 'ఒలీవియా ముప్పు' అని పేరు పెట్టారు. టీనేజర్లు పోర్న్‌ వీడియోలు చూసేలా ప్రేరేపిస్తున్నట్టు తేలింది. ఇప్పటికే 'ఒలీవియా ముప్పు' బారినపడ్డవాళ్లు అనేకమంది ఉన్నారని అంచనా. ఇప్పటికే బ్లూవేల్ గేమ్, మోమో ఛాలెంజ్ కలకలం రేపుతుంటే... ఇప్పుడు కొత్తగా 'ఒలీవియా ముప్పు' పొంచి ఉండటం మరింత ఆందోళనకరం. అయితే పిల్లలపై తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి. మొన్న బ్లూవేల్, నిన్న మోమో ఛాలెంజ్, ఇప్పుడు ఒలీవియా... రేపు మరో కొత్త పేరుతో మరో ముప్పు రావొచ్చేమో.

ఇవి కూడా చదవండి:

అక్టోబర్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ సేల్!

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త!

ఇండియాలో లాంఛైన 'వివో వీ9 ప్రో'!

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?

ఇండియాలో లాంఛైన సాంసంగ్ గెలాక్సీ ఏ7

ఇండియాలో రిలీజైన వివో వీ11
Published by: Santhosh Kumar S
First published: September 26, 2018, 3:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading