Home /News /crime /

AFTER A TWO AND HALF YEAR LOVE AFFAIR THE GIRL WANTED TO LEAVE HER HUSBAND AND LIVE WITH HER LOVER AS WELL AS CONSPIRACY TO COMMIT MURDER SSR

Wife: మూడో పెళ్లి చేసుకున్న భర్తకు, ఈమెకూ 16 ఏళ్ల ఏజ్ గ్యాప్.. భర్తతో ఇలా కనిపించినా.. చివరికి..

ప్రమోద్, కింజల్ (ఫైల్‌ ఫొటో)

ప్రమోద్, కింజల్ (ఫైల్‌ ఫొటో)

ఆమె వయసు 27 సంవత్సరాలు. ఆమె భర్త వయసు 43 సంవత్సరాలు. ఇద్దరి మధ్య 16 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. తన భర్తతో శారీరక బంధం ఆమెకు సంతృప్తినివ్వకపోవడంతో ఆ వివాహిత 31 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

    ఆమె వయసు 27 సంవత్సరాలు. ఆమె భర్త వయసు 43 సంవత్సరాలు. ఇద్దరి మధ్య 16 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. తన భర్తతో శారీరక బంధం ఆమెకు సంతృప్తినివ్వకపోవడంతో ఆ వివాహిత 31 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. భర్త హత్యకు కుట్ర పన్ని ప్రియుడితో కలిసి అనుకున్నంత పని చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ పరిధిలో జరిగింది.

    2020, సెప్టెంబర్ 3న జరిగిన ఈ మర్డర్‌కు సంబంధించిన మిస్టరీని పోలీసులు తాజాగా చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతానికి చెందిన కింజల్, ప్రమోద్ పటేల్ భార్యాభర్తలు. వీళ్లు పెళ్లి చేసుకునే సమయానికి భార్యాభర్తలిద్దరి మధ్య 16 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. పెళ్లయిన కొన్నాళ్లు ప్రమోద్‌తో కింజల్ అన్యోన్యంగానే ఉంది. కానీ.. కొన్ని నెలలకే భర్త ప్రమోద్ తనను సంతృప్తిపరచలేకపోతున్నాడని కింజల్ తీవ్ర మనస్తాపం చెందింది. భర్తతో ఈ విషయంలో గొడవలు జరిగాయి.

    ఆ సమయంలోనే.. కింజల్‌కు 31 ఏళ్ల వయసున్న అమ్రత్ పరిచయమయ్యాడు. ఇద్దరూ రెండేళ్ల పాటు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఈ విషయం కాస్తా ప్రమోద్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఇక.. తన భర్త బతికి ఉండగా ప్రియుడితో కలిసి సుఖంగా ఉండలేనని భావించిన కింజల్ ప్రమోద్ హత్యకు ప్లాన్ చేసింది. అమ్రత్‌తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. ఆగస్ట్ 31, 2020న అమ్రత్, కింజల్ కలిసి ప్రమోద్‌ను చంపేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయం తెలియని కింజల్ భర్త ప్రమోద్ రోజూలానే సెప్టెంబర్ 3, 2020న పని మీద బయటకు వెళ్లాడు. భార్యకు ఫోన్ చేసి ఇంటికి వచ్చేసరికి కాస్త ఆలస్యమవుతుందని చెప్పాడు. ఇదే విషయాన్ని ప్రియుడు అమ్రత్‌కు కింజల్ ఫోన్ చేసి చెప్పింది.

    ఇది కూడా చదవండి: Beer Psycho: బెడ్రూం నిండా ఖాళీ బీర్ బాటిల్స్.. పడుకునే బెడ్‌పై తప్ప.. ఈ ‘బీర్ సైకో’ ఏం చేశాడంటే...

    దీంతో.. ప్రమోద్‌ను అతను పనిచేస్తున్న చోటే చంపాలని అమ్రత్ భావించాడు. అమ్రత్ అప్పటికే ప్రమోద్ హత్య కోసం రాజస్థాన్‌కు చెందిన సురేష్ అనే వ్యక్తికి 5 లక్షల సుపారీ ఇచ్చాడు. కొత్త ఐ10 కారును ప్రత్యేకంగా ఈ హత్య కోసమే తెప్పించాడు. అమ్రత్, సురేష్, సురేష్‌తో పాటు తన స్నేహితుడు అజనీయ కలిసి ప్రమోద్‌ను హైవేపై అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో పోలీసులు అప్పట్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణలో తాజాగా.. ఈ హత్య కింజల్, అమ్రత్ కలిసి ప్లాన్ చేసినట్లు తేలింది. ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో మరికొన్ని విషయాలు కూడా వెలుగుచూశాయి. ప్రమోద్ పటేల్‌కు కింజల్ కంటే ముందు ఇద్దరితో పెళ్లైంది. వాళ్లిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. కింజల్‌ను ప్రమోద్ మూడో పెళ్లి చేసుకున్నాడు. అందువల్లే ఇద్దరి మధ్య అంత ఏజ్ గ్యాప్ ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Extra marital affair, Love affair, Wife kills husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు