Home /News /crime /

AFTER A HOME ENTRANCE CEREMONY AT THE NEWLY CONSTRUCTED HOUSE THESE COUPLE LIFE LEADS TO SAD END SSR

Couple: కొత్తగా ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారు.. కానీ మరుసటి రోజే ఇలా జరగడం..

సద్నా, శ్యామ్ కిషోర్ (ఫైల్ ఫొటోలు)

సద్నా, శ్యామ్ కిషోర్ (ఫైల్ ఫొటోలు)

ఆ దంపతులు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశం కూడా చేశారు. ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆ కొత్త ఇంట్లోనే గృహప్రవేశం చేసిన మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.

  లక్నో:దంపతులు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశం కూడా చేశారు. ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆ కొత్త ఇంట్లోనే గృహప్రవేశం చేసిన మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన లక్నోలోని గోమతి నగర్‌లో ఉన్న గంగోత్రి విహార్ ఫేజ్-IIలో జరిగింది.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగనాథ్ మిశ్రాకు రామ్ కిషోర్, శ్యామ్ కిషోర్, బ్రిజ్ కిషోర్ అనే ముగ్గురు కొడుకులున్నారు. గోండాలోని శివశంకర్ పూర్వా ప్రాంతంలో వీళ్లు నివాసం ఉండేవారు. ఈ అన్నదమ్ములు ముగ్గురూ పెళ్లై పిల్లలున్నప్పటికీ ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉండేవారు. ముగ్గురూ కలిసి బిల్డింగ్ మెటీరియల్ బిజినెస్ చేస్తుండేవారు. వ్యాపారం ఆశించిన విధంగానే సాగడంతో గోమతి నగర్‌లోని గంగోత్రి విహార్ ఫేజ్-IIలో నాలుగంతస్తుల ఇంటిని కట్టుకున్నారు. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌లో బిల్డింగ్ మెటీరియల్ షాప్‌గా, పై రెండు అంతస్తులలో ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలు ఉండేలా ఇంటిని నిర్మించుకున్నారు.

  ఇది కూడా చదవండి: Shocking Incident: ఈ వయసులో ఈమె ఇలాంటి పని చేసిందంటే.. రోజులు ఎటు పోతున్నట్టు..

  నవంబర్ 16న(మంగళవారం) నాడు గృహప్రవేశం కూడా ఘనంగా జరిగింది. బంధుమిత్రులందరినీ కొత్త ఇంటికి పిలిచి గృహ ప్రవేశ వేడుక సందర్భంగా భోజనాలు కూడా పెట్టించారు. కొత్త ఇంట్లో డ్యాన్స్ చేస్తూ తమ సంతోషాన్ని నలుగురితో పంచుకున్నారు. ఆ రాత్రి ఎవరి గదిలో వాళ్లు పార్టీ అయిపోయాక పడుకున్నారు. బుధవారం ఉదయం శ్యామ్ కిషోర్ కుటుంబం మాత్రం ఎంత పొద్దెక్కినా బయటకు రాలేదు. దీంతో.. కేకలేసి మరీ తలుపు కొట్టారు. అయినా ఎవరూ బయటకు రాకపోవడంతో కిటికీ తలుపు పగులకొట్టి చూడగా.. శ్యామ్ కిషోర్(38) నట్టింట్లో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అతని భార్య సద్నా(36) కూడా బెడ్‌పై విగతజీవిగా కనిపించింది. ఆమె బెడ్‌కు దగ్గర్లో వారి తొమ్మిదేళ్ల పాప ప్రియాన్షీ అమాయకంగా చూస్తూ తల్లి కాళ్ల దగ్గర కూర్చుని ఉంది. ఏడేళ్ల కొడుకు అవినాష్ నిద్రిస్తూ కనిపించాడు. గృహ ప్రవేశం సందర్భంగా ఇంటికొచ్చిన బంధువులు ఇంట్లోనే ఉన్నారు.

  ఇది కూడా చదవండి: Lovers: ఈ లవర్స్ పెద్దలను ఒప్పించారు.. డిసెంబర్ 10న పెళ్లి.. ఇంతలోనే ఎంత పనయింది దేవుడా..

  అంతా సంతోషంగా సాగిపోతున్న వేళ శ్యామ్ కిషోర్, సద్నా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. పోలీసులు స్పాట్‌కు చేరుకుని భార్యాభర్తల మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. ఫోరెన్సిక్ టీం స్పాట్‌లో ఆధారాలను సేకరించింది. పోలీసుల ప్రాథమిక విచారణలో శ్యామ్ కిషోర్, సద్నా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమేనని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ.. భార్యాభర్తల మధ్య గొడవ చివరకు ఇలా ప్రాణాలు తీసుకునేంత వరకూ వెళుతుందని అనుకోలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోస్ట్‌మార్టం నివేదికతో మరిన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. భార్యను చంపి తాను ఉరేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగా కట్టుకున్న ఇంట్లో అడుగుపెట్టిన మరుసటి రోజే ఇంతటి విషాదం చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Family suicide, Husband kill wife, Wife and husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు