AFTER 2 MONTHS OF MARRIAGE THE GIRL WAS LIVING IN THE LIVE IN WITH A DIVORCE BROKE THE HEAD OF THE YOUNG MAN WITH STICKS SSR
Married Woman: పెళ్లైన రెండు నెలలకే భర్తకు విడాకులు.. మరో వ్యక్తితో సహ జీవనం.. ఆమె లైఫ్ ఎక్కడ ఆగిందంటే..
పూనమ్
రాజస్థాన్లోని అల్వార్లో ఓ వ్యక్తి హత్య జరిగిన తీరు కలకలం రేపింది. ఓ మహిళను ఆ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె గురించి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
అల్వార్: రాజస్థాన్లోని అల్వార్లో ఓ వ్యక్తి హత్య జరిగిన తీరు కలకలం రేపింది. ఓ మహిళను ఆ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె గురించి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూనమ్ అనే యువతికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన రెండు నెలలకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కరణ్ సింగ్ అనే యువకుడితో ఆమె సహ జీవనం చేస్తోంది. కొన్నేళ్ల నుంచి వీళ్లిద్దరూ భార్యాభర్తల్లా కలిసే ఉంటున్నారు. జూన్ 25న పూనమ్, కరణ్ మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.
ఈ క్రమంలో క్షణికావేశంలో పూనమ్ చేతికి దొరికిన ఓ వస్తువుతో కరణ్ తలపై కొట్టింది. బలంగా కొట్టడంతో కొద్దిసేపటికే తలపై నుంచి రక్తం కారుతున్న స్థితిలో కరణ్ కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతనిని చూసి భయంతో పూనమ్ అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనలో కరణ్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ హత్య కేసులో పూనమ్ కోసం ఐదు నెలలుగా వెతుకులాట సాగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియలేదు. కానీ.. ఎట్టకేలకు పూనమ్ ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఓ ఇన్ఫార్మర్ సాయంతో ఆమె ఎక్కడుందో కనిపెట్టి అరెస్ట్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమెకు అప్పటికే పెళ్లై విడాకులు కూడా తీసుకున్నట్లు తెలిసింది.
అంతేకాదు.. భార్యాభర్తలమని చెప్పి పూనమ్, కరణ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. కొన్నేళ్ల నుంచి అదే ఫ్లాట్లో ఉంటున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. చీటికీమాటికీ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలోనే కరణ్ తాగొచ్చి ఆమెతో గొడవపడేవాడు. భర్తను వదిలేసి తనతో వచ్చేశావంటూ పలుమార్లు అనడంతో పూనమ్ తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మరింత ముదిరాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకూ వెళ్లాయి.
క్షణికావేశంలో కరణ్ తలపై కొట్టానని, హత్య చేసే ఉద్దేశంతో దాడి చేయలేదని పూనమ్ విచారణలో చెప్పింది. అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఇన్నాళ్లు తప్పించుకుని పోయినట్లు తెలిపింది. పూనమ్ ఐదున్నర నెలల నుంచి పోలీసుల కంటపడకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆమెను హత్య కేసులో జైలుకు తరలించారు. భర్తకు విడాకులిచ్చి, ప్రియుడికి దగ్గరైన పూనమ్ జీవితం చివరికి ఆ ప్రియుడినే చంపి కటకటాల పాలయ్యేంతవరకూ వెళ్లింది. క్షణిక సుఖాల కోసం తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు చివరకు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో పూనమ్ ఎపిసోడ్ చెప్పకనే చెబుతోంది. సమాజంలో ఇలాంటి ఘటనలు రోజుకు ఎన్నో వెలుగుచూస్తున్నా కొందరి ఆలోచన తీరు మాత్రం ఏమాత్రం మారడం లేదు. వివాహేతర సంబంధాల మోజులోనో లేక ఇంకెవరిపైనో ఇష్టం పెంచుకునో పచ్చని కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కట్టుకున్న భర్తకు విడాకులిచ్చిన పూనమ్ జీవితం ఇలా ఊహించని మలుపు తీసుకుంది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.