ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు... 12 ఏళ్ల తర్వాత రీ పోస్టుమార్టం

దీంతో దాదాపు ఆయేష మర్డర్ జరిగి 12 సంవత్సరాల తరువాత అయేషా మీరా డెడ్ బాడీకి రీపోస్ట్ మార్టమ్ నిర్వహించాలని సీబీఐ అధికారులు సిద్దమవుతున్నారు.

news18-telugu
Updated: July 13, 2019, 3:24 PM IST
ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు... 12 ఏళ్ల తర్వాత రీ పోస్టుమార్టం
అయేషా మీరా (File)
  • Share this:
ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దాదాపు ఈ హత్య జరిగి 12 ఏళ్లు కావస్తున్న ఇప్పటివరకు కేసు కొలిక్కి రాలేదు. నిందితులు ఎవరన్న విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు కానీ అటు సీబీఐ కానీ తేల్చలేక పోయింది. దీంతో దాదాపు ఆయేష మర్డర్ జరిగి 12 సంవత్సరాల తరువాత అయేషా మీరా డెడ్ బాడీకి రీపోస్ట్ మార్టమ్ నిర్వహించాలని సీబీఐ అధికారులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయేషా తల్లిదండ్రుల వద్ద డీఎన్ఏ‌ను కూడా సేకరించారు అధికారులు.

ఆయేషా డీఎన్‌ఏ టెస్ట్‌కు తమ మతపెద్దలు ఒప్పుకోలేదు. దీంతో సీబీఐ  కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంది. టెస్టులకు తాము సహకరిస్తామని తెలిపారు ఆయేషా తల్లిదండ్రులు. అయేషా కేసులో దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తూనే ఉన్నామన్నారు.  తమకు పోలీసులు, కోర్టులు, రాజకీయ నాయకులపై నమ్మకం లేదన్నారు. సీబీఐ కూడా న్యాయం చెయ్యకపోతే ఇక ఏ వ్యవస్థను ప్రజలు నమ్మరన్నారు ఆయేషా తల్లిదండ్రులు.

తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా హత్య కేసును కొన్నిరోజుల క్రితం సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టుఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఆయేషా హత్య కేసులో సత్యం బాబు నిర్దోషి అంటూ గతేడాది హైకోర్టు నిర్థారించింది. అయితే ఆయేషా హత్య కేసులో అసలు దోషులెవరో తేల్చి శిక్షించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల ఫైలు కనిపించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయేషా కేసులో దర్యాప్తు సరిగ్గా లేదంటూ పోలీసులపై మండిపడింది.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు