Home /News /crime /

AFTER 11 YEARS OF MARRIAGE THE MOTHER OF TWO CHILDREN ABSCONDED WITH HER LOVER IN HARYANA VB

Extramarital Affair: ఆమెకు ఇద్దరు పిల్లలు.. అదే పనిగా భార్య ఫోన్.. తెల్లారేసరికే ఊహించని ఘటన.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Extramarital Affair: ఆమెకు వివాహం జరిగి 11 ఏళ్లు పూర్తయ్యాయి. వారికి ఇద్దరు సంతానం. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఆ వ్యక్తితో ఈమె తరచూ మాట్లాడుతుండేది. ఓ రోజు భర్త, పిల్లలను వదిలేసి అతడితో వెళ్లిపోయింది. కారణం ఏంటంటే..

    ఆమెకు వివాహం జరిగి 11 సంత్సరాలు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. హాయిగా కుటుంబంలో ఎలాంటి కలతలు లేకుండా సాగిపోతోంది. ఇంట్లో ఏం కావాలన్నా తన భర్త కాదని తెచ్చి ఇచ్చేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చేవి కావు. కొన్ని రోజుల తర్వాత ఆమె మొబైల్ ఫోన్ కు ఆకర్శితురాలు అయింది. ప్రతీ రోజు గంటల తరబడి ఫోన్ లో మాట్లాడేది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఆ వ్యక్తి తో ఆమె ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ప్రతీ రోజు ఫోన్ లో మాట్లాడుతుండగా తన భర్త ఓ రోజు అడిగేశాడు. ఎవరితో మాట్లాడుతన్నావ్.. ఇంత సేపు మట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. అయితే ఆమె సమాధానం ఏం చెప్పిందంటే.. తన స్నేహితుడితో మాట్లాడుతున్నాని.. ఏదో సమాధానం చెప్పి దాట వేసింది. ఆ రోజుకు గండం గడిచిందనుకుంది.

    భర్తను అనుమానం వచ్చిందనుకొని ఓ రోజు రాత్రి తన పిల్లలను, భర్తను వదిలేసి తన ఫోస్ స్నేహితుడితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తెల్లారేసరికి పిల్లలు అమ్మా.. అమ్మా అంటూ అల్లాడిపోయారు. దీంతో అతడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. చేసేది లేక స్థానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులకు జరిగిన విషయాలు అన్ని చెప్పాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని సబర్వాస్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్, పింకీ 11 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. మొదట్లో ఇద్దరు బాగానే ఉన్నారు. కొన్ని సంవత్సరాల వరకు వీరికి సంతానం కలగలేదు. తర్వాత ఇద్దరు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది.

    అయితే ఇటీవల పింకీకి మొబైల్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో రోజూ గంటల తరబడి మాట్లాడుతూనే ఉండేది. భర్తకు అనుమానం వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. చివరకు ఈ నెల 8వ తేదీన పింకీ తన స్నేహితుడుతో కలిసి వెళ్లిపోయింది. పిల్లలిద్దరూ తల్లి కోసం అల్లాడుతున్నారు. దీంతో అనిల్ అగ్రోహ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొబైల్ ఫోన్ ఆధారంగా పింకీని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తల్లి కనిపించకపోవడంతో ఆ చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Extramarital affairs, Wife

    తదుపరి వార్తలు