చదువుకునే రోజుల్లో మొదలైన ప్రేమ... 11 ఏళ్ల తర్వాత ఏమైందంటే...

ప్రతీకాత్మక చిత్రం (image credit - youtube)

మనుషుల్ని నమ్మాలా వద్దా అనే ప్రశ్నకు ఎప్పుడూ సమాధానం సరిగా ఉండదు. నమ్మాలని కొందరు, నమ్మకూడదని కొందరు అంటారు. ఎవర్ని నమ్మాలి, ఎవర్ని నమ్మకూడదు అనేవి తర్వాతి ప్రశ్నలు. ఈ కథలో ఏం జరిగింది?

 • Share this:
  అది 2009వ సంవత్సరం. మధ్యప్రదేశ్. భోపాల్... అశోక చోళాలోని ఓ టెంపుల్ ఏరియాలో నివసిస్తోంది బాధితురాలు. అప్పుడామె వయస్సు 22 ఏళ్లు. చదువుకుంటూ... కోచింగ్ తీసుకుంటోంది. ఆమెకు నివాడీలో నివసిస్తున్న ప్రవీణ్ పటేరియా పరిచయం అయ్యాడు. ఇద్దరు ప్రెండ్స్ అయ్యారు. కట్ చేస్తే... 2009 డిసెంబర్ 10న అతను అశోక గార్డెన్‌లో ఓ రూం అద్దెకు తీసుకున్నాడు. ఓ రోజు ఆమెను రూమ్‌కి తీసుకెళ్లాడు. స్టడీ విషయమై మాట్లాడుకుందాం అన్నాడు. తీరా రూంకి వెళ్లాక... పెళ్లి చేసుకుంటా అని చెప్పి... రేప్ చేశాడు. ప్రవీణ్... ఆ టైంలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తన చదువు అయిపోగానే పెళ్లి చేసేసుకుందాం అన్నాడు. తనకు మంచి ఉద్యోగం వచ్చి తీరుతుంది అన్నాడు. నిజమే అనుకుంది. కానీ... 2016లో మకాం మార్చాడు. భోపాల్‌లో మరో ప్రాంతానికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోమంటూ... అక్కడికీ వెళ్లింది. అక్కడా ఆమెను హోటల్ లేదా ఫ్రెండ్ రూమ్‌కి తీసుకెళ్లి సెక్స్ కోరికలు తీర్చుకున్నాడు.

  ఇలా 11 ఏళ్లు గడిచాయి... ప్రతిసారీ అదే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నాడు. నిస్సహాయతలో ఉన్న ఆమె... తనకు వేరే దిక్కులేదనుకుంటూ... బతిమలాడుతూనే ఉంది. మూడ్రోజుల కిందట ఇదే విషయమై కాస్త గట్టిగా అడిగింది. దాంతో... గుడిలో పెళ్లి చేసుకుందాం అన్నాడు. తన బంధువులతో సహా గుడికి వెళ్లింది. గుడికి వచ్చిన అతను... పెళ్లి మాత్రం చేసుకోలేదు. నాటకాలు ఆడాడు. దాంతో బంధువులు నిలదీశారు. అప్పుడు చెప్పాడు తనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని. ఎలా స్పందించాలో, ఎలా తమ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలో వాళ్లకు అర్థం కాలేదు.

  ఇది కూడా చదవండి: ఆన్‌లైన్ క్లాసుల్లో యువతి... పరిచయమైన కుర్రాడు... ఆ తర్వాత షాక్

  ఇలాంటి వ్యక్తిని తాను ఇన్నాళ్లూ మనస్ఫూర్తిగా నమ్మానే... నా సర్వస్వం అర్పించానే అని కుమిలిపోయిన బాధితురాలు... కొంతసేపటి తర్వాత కోలుకుంది. ఇలాంటి వాళ్లను వదలకూడదు అని డిసైడ్ అయ్యింది. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. రేప్ కేసు పెట్టింది. కేసు రాసిన పోలీసులు... పరారీలో ఉన్న అతన్ని త్వరలోనే పట్టుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
  Published by:Krishna Kumar N
  First published: