హోమ్ /వార్తలు /క్రైమ్ /

Psycho Lover | Delhi Murder : ప్రియురాలిని చంపిన కేసులో అరెస్టైన ప్రియుడు లాకప్‌లో ఏం చేశాడో ఈ వీడియో చూడండి

Psycho Lover | Delhi Murder : ప్రియురాలిని చంపిన కేసులో అరెస్టైన ప్రియుడు లాకప్‌లో ఏం చేశాడో ఈ వీడియో చూడండి

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Psycho Lover: తనతో సహజీవనం చేస్తున్న అమ్మాయిని చంపి..శవాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. మరికొందరు అమ్మాయిలను ఇంటికి పిలిపించుకొని అదే ఇంట్లో గడిపాడు. శవం వాసన రాకుండా అగర్‌బత్తీలు వెలిగించిన దుర్మార్గుడు..పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత లాకప్‌లో హాయిగా నిద్రపోతున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

తనతో సహజీవనం చేస్తున్న అమ్మాయి పెళ్లి చేసుకోమని  పదే పదే కోరడంతో విసిగిపోయాడు. ఆమె అడ్డు తొలగించుకునేందుకు చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆ ముక్కల్ని పార్సిల్ చేసి ఢిల్లీ(Delhi)లోని వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన ప్రేమోన్మాది అప్తాబ్ అమీన్‌ పూనావాల(Aftab Amin Poonawala)ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆఫ్తాబ్‌ను ఐదు పోలీస్ రిమాండ్‌(Remand)కు తరలించారు. తనను ప్రేమించిన అమ్మాయిని అత్యంత కిరాతకంగా హత్య చేసి..శవాన్ని ముక్కలుగా పారేసినప్పటికి అతనిలో ఏమాత్రం జాలి, భయం, పశ్చాత్తాపం కనిపించలేదు. పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌(Lockup)లో పెట్టారు. సెల్‌లో ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడేమోనని 24గంటల పాటు అబ్జర్వేషన్‌లో పెడితే ఇంత ఘాతుకానికి పాల్పడిన నేరస్తుడు హాయిగా నిద్రపోవడం చూసి పోలీసులే షాక్ అవుతున్నారు.

Nithyananda swamy: నిత్యానందస్వామి ఉద్యోగాలిస్తారంటూ ప్రచారం .. జీతం ఎంత..? జాబ్ ఎక్కడో తెలుసా..?

ఉన్మాది కాదు నరరూప రాక్షసుడు..

ఢిల్లీ మెహ్రౌలీలో ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న శ్రద్ధాకపూర్ అనే ఓ అమ్మాయి మర్డర్ కేసులో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. మృతురాలిని మే 22వ తేదిన అత్యంత కిరాతకంగా చంపిన ప్రియుడు అప్తాబ్ అమీన్‌ పూనావాల ఆమె మృతదేహాన్ని ముక్కులు ముక్కలు చేసి కొత్తగా కొనుగోలు చేసిన ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. శ్రద్ధ వాకర్ హత్య జరిగిన 20-25 రోజుల తర్వాత మృతదేహం ఇంట్లో ఉండగానే డేటింగ్ యాప్ ద్వారా అఫ్తాబ్ మరో అమ్మాయిని తన ఇంటికి తీసుకొచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని కొనగించినట్లుగా పోలీసుల విచారణలో ఒప్పకున్నాడు.

హత్య చేసి హాయిగా నిద్రపోతున్నాడు..

నిందితుడు ఆఫ్తాబ్ ఒకరిద్దరు కాదు తరచూ అమ్మాయిలను డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లు అంగీకరించాడు. తాను నేరం చేసిన విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. శవం భాగాలు ఇంట్లో వాహన వస్తుందని అగర్‌బత్తీలు వెలిగించి ఇంటికి తెచ్చుకున్న అమ్మాయిలకు కూడా డౌట్‌ రాకుండా మేనేజ్ చేశానని చెప్పాడు.

శవాన్ని ఇంట్లో పెట్టుకొని వేరే వాళ్లతో శృంగారం

సైకోలా మారిన ఆఫ్తాబ్‌ని ఐదు రోజుల పోలీస్ రిమాండ్‌కు తరలించారు. అయితే నేరం చేసిన పశ్చాత్తాపం కూడా లేకుండా అతడ్ని లాకప్‌లో పెడితే దర్జాగా నిద్రపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు సౌత్‌ అదనపు డీసీపీ అంకిత్‌ చౌహాన్‌. ఆఫ్తాబ్‌ చంపి ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన శ్రద్దా వాకర్ మృతదేహం శరీర భాగాల వెదుకుతున్నారు పోలీసులు. కొన్ని అవశేషాలు దొరికాయని ..అయితే అవి మనుషులకు చెందినవో కాదో తెలియాల్సి ఉందంటున్నారు పోలీసులు.

నమ్మిన అమ్మాయి గొంతు కోసిన వైనం..

శ్రద్దా వాకర్‌ ముంబైకి చెందిన యువతి. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తుండగా తనకు పరిచయం అయ్యాడు ఆఫ్తాబ్. అతడ్ని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడం వాళ్లు నిరాకరించారు. దీంతో ఆమె అతడితో కలిసి సహజీవనం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, ఆచూకి దొరక్కపోవడంతో తల్లిదండ్రులు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చి మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ఢిల్లీ వాసి అని ఇద్దరూ లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని..అందులో భాగంగానే శ్రద్ధను ప్రియుడు ఆఫ్తాబ్ చంపాడని పోలీసులు విచారణలో రాబట్టారు.

First published:

Tags: Delhi news, Murder case

ఉత్తమ కథలు