Honey Trap : అమ్మాయిని వల వేసి... అడ్డంగా దోచేసిన ముఠా...

Honey Trap : ఓ ప్లాన్ ప్రకారం జరిగిన నేరం ఇది. ముగ్గురు విదేశీయులను ఢిల్లీలో అరెస్టు చేశారు పోలీసులు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 25, 2019, 1:13 PM IST
Honey Trap : అమ్మాయిని వల వేసి... అడ్డంగా దోచేసిన ముఠా...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 25, 2019, 1:13 PM IST
ఆఫ్రికా నుంచీ వచ్చిన ఓ యువతి, ఇద్దరు కుర్రాళ్లూ... ఢిల్లీ... వస్నాలో నివసిస్తున్న చింతన్ షాను టార్గెట్ చేశాడు. అమ్మాయిలంటే పడిచస్తున్న అతన్ని ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవాలని ఓ ప్లాన్ వేశారు. దాని ప్రకారం వాళ్లు ఫేస్‌బుక్‌లో సియన్నా జెస్సీ పేరుతో ఓ అకౌంట్ క్రియేట్ చేశారు. దాని ద్వారా చింతన్ షాకి రిక్వెస్ట్ పంపారు. ఆమె ఫొటోలు చూసి ఫ్లాట్ అయిన చింతన్... రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. తర్వాత చింతన్‌తో చాటింగ్ మొదలైంది. తాను విదేశాల్లో హై పొజిషన్‌లో ఉన్నట్లు ఆమె చెప్పింది. ఆమె ఫొటోలు, స్టైల్ అన్నీ చూసి... నిజమే అనుకున్నాడు. కొన్ని రోజులకు ఆమె వర్చువల్ నంబర్ (ఇంటర్నెట్ ద్వారా మాట్లాడే ఫోన్ నంబర్) ద్వారా అతనితో మాట్లాడింది. తియ్యటి మాటలతో కవ్వించింది. కరిగిపోయాడు. గురుడు దారిలోకి వచ్చాడని డిసైడయ్యాక... తాను త్వరలో ఇండియాకి వస్తున్నానని చెప్పింది.

మూడ్రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచీ అంటూ చింతన్‌కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె దగ్గర ఫారిన్ కరెన్సీకి చెందిన డిమాండ్ డ్రాఫ్ట్ ఉందనీ, అందువల్ల ఆమెను అదుపులోకి తీసుకున్నామనీ డూప్లికేట్ అధికారులు చింతన్‌కి చెప్పారు. ఆమెను విడుదల చెయ్యాలంటే... ఆమె దగ్గరున్న డీడీ క్యాష్‌ 10 లక్షల డాలర్లు (రూ.6,89,67,895) ను ఏదైనా ఇండియన్ బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చెయ్యాలని అన్నారు డూప్లికేట్ అధికారులు. నిజమే అనుకున్నాడు. ఎవరి అకౌంట్‌లోకో ఎందుకు చింతన్ అకౌంట్‌లోకే ట్రాన్స్‌ఫర్ చెయ్యండి అంది ఆమె. తనపై ఎంత నమ్మకం ఉందో ఆమెకు అనుకున్నాడు. సరే అన్నాడు.

డాలర్లను ట్రాన్స్‌ఫర్ చెయ్యాలంటే... ఇందుకు కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ కోసం రూ.5.37లక్షలు ముందుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు అధికారులు. వచ్చేది రూ.6 కోట్లకు పైగా. పోయేది రూ.5 లక్షలు అనుకున్నాడు. డబ్బు వచ్చాక... అందులోంచీ... తాను చెల్లించే మొత్తాన్ని తాను తీసుకొని... మిగతాది ఆమెకు ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఆమెను ఎలాగైనా విడిపించాలన్న ఆతృతలో... హడావుడిగా రూ.5.37 లక్షలు... డూప్లికేట్ అధికారులు చెప్పిన అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఒక్కసారి మనీ ట్రాన్స్‌ఫర్ అయ్యాక... కాల్ కట్ అయ్యింది. ఇక ఆ నంబర్‌కి ఎన్నిసార్లు చేసినా... అలాంటి నంబర్ వాడుకలో లేదనే సమాధానం వస్తోంది.

తాను అడ్డంగా మోసపోయానని గ్రహించిన చింతన్ షా... ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు అతనికి వచ్చిన ఇంటర్నెట్ వర్చువల్ కాల్ ఎక్కడి నుంచీ చేశారా అని సెర్చ్ చేశారు. అది ఢిల్లీ నుంచే వచ్చినట్లు తేలింది. ఐపీ అడ్రెస్ ఆధారంగా... సెర్చ్ చేశారు. తద్వారా నైజీరియాకు చెందిన చుక్వుబెకా ఇబోడీ, ఉగాండాకు చెందిన ఐషా నుములుంబా, తూర్పు ఆఫ్రికాకు చెందిన ఔలా డివాయిర్‌ను అరెస్టు చేశారు.



తెలియనివాళ్లతో ఇలా పరిచయాలు పెంచుకొని... కనీసం మొహం కూడా చూడకుండా మనీ ట్రాన్స్‌ఫర్లు చెయ్యడం కరెక్టు కాదంటున్నారు పోలీసులు. ఆఫ్రికా నుంచీ చాలా మంది ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
First published: July 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...