రాజకీయ జీవితానికి అడ్డొస్తుందని... కన్న కూతుర్నే హతమార్చిన కిరాతక తండ్రి

తాను రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో.. కూతురు అడ్డువస్తుందేమోనని భావించిన ఒక తండ్రి.. అత్యంత అమానవీయ ఘటనకు ఒడిగట్టాడు.

news18
Updated: October 14, 2020, 7:29 PM IST
రాజకీయ జీవితానికి అడ్డొస్తుందని... కన్న కూతుర్నే హతమార్చిన కిరాతక తండ్రి
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 14, 2020, 7:29 PM IST
  • Share this:
రోజులు మారుతున్న కొద్దీ సమాజంలో వస్తున్న మార్పులను చూసి సంతోషపడాలో.. లేక మానవ సంబంధాలు నానాటికీ దిగజారుతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. అధికార యావ, సంపాదనార్జన భ్రమలో పడిన మనుషులు మానవ సంబంధాలను కాలరాస్తున్నారు. తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కూతురు, కోడలు.. ఎవరమీదా ఆప్యాయతలు, అనురాగాలు లేవు. నేర ప్రవృత్తి విశృంఖలంగా విస్తరిస్తున్నది. అందుకు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కర్నాటకలో ఒక తండ్రి తన కన్న కూతుర్నే అత్యంత దారుణంగా హతమార్చాడు.

వివరాలిలా ఉన్నాయి.. చిత్రదుర్గ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన నింగప్ప కు ఇద్దరు భార్యలు. అయితే రెండో భార్య విషయం ఎవరికీ తెలియకుండా.. గుట్టుగా వ్యవహారం నడిపిస్తున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు సంతానం. రెండేండ్ల క్రితమే రెండో భార్యకూ కూతురు పుట్టింది. కాగా, స్థానికంగా కొద్దిగా పలుకుబడి ఉన్న నాయకుడిగా ఎదిగిన నింగప్ప.. వచ్చే సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య, ఆమె కూతురు తన రాజకీయ జీవితానికి అడ్డొస్తారేమోనని అతడికి భయం వేసింది. అంతే.. వారినెలాగైనా అంతం చేయాలనుకున్నాడు.

అనుకున్నదే తడువుగా... రెండేండ్ల పాపను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆ చిన్నారిని చంపేశాడు. సాక్ష్యాధారాలు దొరకకుండా ఆ పసిపాప మృతదేహాన్ని కాల్చి బూడిద చేశాడు. ఇదంతా నెల రోజుల క్రితం జరిగింది.  రెండేండ్ల పాప తప్పిపోయిందని ఆమె తల్లి వెతకడం ప్రారంభించింది. ఎంతకూ కనిపించకపోయేసరికి ఆమెకు నింగప్ప మీద అనుమానం వచ్చింది. ఈ విషయం మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతడితో అసలు విషయం కక్కించారు. అయితే.. ఈ విషయం బయటకు తెలిస్తే తన రాజకీయజీవితం సర్వనాశనం అవుతుందని, అందుకే తన బిడ్డను హతమార్చినట్టు అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు.

నాలుగేండ్ల కింద నుంచే నింగప్ప తనతో శారీరక సంబంధాలు కలిగి ఉన్నాడని.. తనను రెండో పెళ్లి చేసుకోవాలని ఎన్నో సార్లు చెప్పినా ఆ విషయాన్ని దాటవేశాడని చనిపోయిన పాప తల్లి చెప్పుకొచ్చింది. ఇదే విషయమై నిందితుడి మొదటి భార్య స్పందిస్తూ.. నింగప్ప రెండో భార్య గురించి నాకు తెలియదని తెలిపింది. తనకు ముగ్గురు కొడుకులున్నారనీ, నింగప్ప ఇంకో కాపురం పెట్టిన విషయం బయట చెప్పుకుంటుంటే విని తాను కూడా పలుమార్లు అడిగానని, కానీ అతడు ఆ ఆరోపణలను కొట్టిపారేశాడని తెలిపింది. తన భర్త ఇంత అమానవీయ చర్యకు ఒడిగడతాడని తాను అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చింది. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 14, 2020, 7:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading