హోమ్ /వార్తలు /క్రైమ్ /

Affair: మరో యువతితో భర్తకు ఎఫైర్.. భార్యకు ఫోన్ చేసి ఊహించని షాక్..

Affair: మరో యువతితో భర్తకు ఎఫైర్.. భార్యకు ఫోన్ చేసి ఊహించని షాక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Punjab: పెళ్ళై రెండేళ్లయ్యింది. భార్యను కొన్ని రోజులుగా పట్టించుకొవడం మానేశాడు. మరో యువతి మోజులో పడి, ఆమెతోనే ఎక్కువగా మాట్లాడేవాడు.

కొందరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లయ్యాక కూడా వివాహేతర సంబంధాలు (Extra marital affair) పెట్టుకుంటూ నీచంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ సంబంధాలతో తమ పరువును, తమ వాళ్ల పరువును బజారుకు ఈడుస్తున్నారు. కొన్ని సార్లు వివాహేతర సంబంధాలను భరించలేక కొంత మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు వార్తలలో ఉంటున్నాయి. ఈ కోవకు చెందిన మరోక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. పంజాబ్ లో (Punjab) ఫరీద్ కోట్ జిల్లాలో దారుణం జరిగింది. తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసి భరించలేక పోయింది. దీంతో తన పుట్టింటికి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడింది. కాగా, గురుప్రీత్ సింగ్ కు సదరు బాధితురాలికి రెండెళ్ల క్రితం పెళ్లైయింది. ఇతను ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఈ క్రమంలో కొన్నిరోజులుగా గురు ప్రీత్ సింగ్ మరో యువతితో ఎఫైర్ (Affair) నడిపిస్తున్నాడు.

ఆమెతోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. తరచుగా కలుసుకునే వారు. ఈ మధ్యలో, భర్త ఫోన్ చేసి తాను.. తన ప్రేయసీని పెళ్లి చేసుకొవాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైంది. తన కూతురుతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత..తన బాధను తట్టుకోలేక ఇంట్లో ఎవరు లేనిది చూసి విషం తాగి ఆత్మ హత్య చేసుకుంది. బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా  ఒక యువతి పీటల మీద పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ లో  (Uttar pradesh) వెరైటీ సంఘటన జరిగింది. కాన్పూర్ లోని మంగళ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పెళ్లి వేడుక కార్యక్రమం అరెంజ్ మెంట్స్ అన్ని అయ్యాయి. కాసేపట్లో జయమాల కార్యక్రమం జరుగుతుంది. ఈ క్రమంలో వధువు వేదిక మీదకు చేరుకుంది. అక్కడ కాసేపు కూర్చుంది. అయితే అక్కడ ఫోటోగ్రఫి, వీడియో గ్రఫి లేరని తెలుసుకుని షాక్ కు గురయ్యింది. వెంటనే అక్కడికి నుంచి లేచి పక్కింటికి వెళ్లిపోయింది.

దీంతో బంధువులు వధువు దగ్గరకు చేరుకున్నారు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని అరుదైన సంఘటన. అట్లాంటి పెళ్లిలో వేడుకలో ప్రతి ఒక్క వేడుకున ఎల్లకాలం ఫోటోలు, వీడియోల రూపంలో (Photo graphy) గుర్తుపెట్టుకొవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. ఈ మాత్రం తెలియని వ్యక్తి.. జీవితాన్ని ఎలా నెట్టుకొస్తాడు.. అలాంటి వ్యక్తితో తాళి కట్టించుకొవడానికి తాను సిద్ధంగా లేదని ఆమె (Angry bride) తెగేసి చెప్పేస్తుంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Illegal affair, Love affair, Punjab

ఉత్తమ కథలు