Adilabad Firing: ఆదిలాబాద్ జిల్లాలో MIM నేత ఫరూక్ జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో MIM నేత ఫరూక్ జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి (File Image)

Adilabad Firing: MIM నాయకుడు ఫరూక్ జరిపిన కాల్పులలో తీవ్రంగా గాయపడిన జమీర్ NIMSలో చికిత్స పొందుతూ మరణించాడు.

  • Share this:
    Adilabad MIM Leader Firing: ఆదిలాబాద్ జిల్లాలో వారం కిందట జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందారు. కాల్పులలో రెండు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయరడిన జమీర్... నిమ్స్ (NIMS)లో చికిత్స పొందుతూ మరణించాడు. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ గత వారం ఈ కాల్పులు జరిపాడు. ఇద్దరిపై ఆయన కాల్పులు జరిపాడు. ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు, తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ తన లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఒక వ్యక్తి పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇద్దరి మీద కాల్పులు జరిపిన ఫారూక్ అహ్మద్ మరొకరిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన వారు ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం లభించిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రిమ్స్ ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. ఎంఐఎం కార్యకర్తలు కూడా వచ్చారు.

    ఇదీ కాల్పులకు కారణం:
    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిల్లలు క్రికెట్ ఆడుకునే విషయంలో గొడవ మొదలైంది. ఆదిలాబాద్‌ టూటౌన్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న తాటిగూడలో సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ పిల్లల గొడవలో పెద్దలు జోక్యం చేసుకున్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ తన లైసెన్స్‌డ్ గన్‌ (.32 పిస్టల్)తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సయ్యద్ జమీర్‌కు రెండు బుల్లెట్లు తగిలాయి. సయ్యద్ మోతేశ్యామ్ అనే వ్యక్తి కడుపులోకి మరో బుల్లెట్ దూసుకెళ్లింది. సయ్యద్ మన్నన్ అనే వ్యక్తి మీద కత్తితో దాడి చేయడంతో అతడికి గాయమైంది.

    ఇది కూడా చదవండి:Telangana Covid 19: తెలంగాణలో తగ్గుతున్న కరోనా... ఆ 4 జిల్లాల్లోనే ఎక్కువ ప్రభావం

    ఈ ఘటనకు సంబంధించి ఫరూక్ మీద పోలీసులు హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కాల్పులు జరిపిన పిస్టల్‌ను సీజ్ చేశారు.
    Published by:Krishna Kumar N
    First published: