ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్... ఉరి వేసుకున్న యువకుడు...

Pune : ఆన్‌లైన్ గేమ్ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ కుర్రాడు సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 20, 2019, 9:41 AM IST
ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్... ఉరి వేసుకున్న యువకుడు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Blue Whale : మహారాష్ట్రలో... 20 ఏళ్ల దివాకర్ మాలీ... లోనీఖండ్‌లో చదువుకుంటున్నాడు. ఈమధ్య మొబైల్ గేమ్స్‌కి బాగా అలవాటుపడ్డాడు. ఎప్పటికప్పుడు కొత్త గేమ్స్ కావాలి, కిక్ ఇవ్వాలి అనేవాడు. ఆ మాటలు విన్న తండ్రి... గేమ్స్ కాదు చదువుపై దృష్టి పెట్టు అని తిడుతూ ఉండేవాడు. ఐతే... మనకి తెలుసు... బ్లూ వేల్ లాంటి గేమ్స్ ఆడి విదేశాల్లో చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు. ఇండియాలో కూడా అలాంటి ఘటనలు ఒకట్రెండు జరిగాయి. తాజాగా దివాకర్ కూడా అలాంటి ఏదో గేమ్ మాయలో పడ్డాడు. కొన్ని రోజులుగా అతని ప్రవర్తన తేడాగా ఉంది. అయినప్పటికీ అతని తండ్రి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వీడికి ఎప్పుడూ గేమ్స్ గోలే... అనుకున్నాడు. ఆ పరిస్థితుల్లో... రాత్రి ఇంట్లో పడుకున్న దివాకర్... తెల్లారి 8 అయినా నిద్రలేవలేదు. అతన్ని నిద్రలేపుదామని ఆ గది దగ్గరకు వెళ్లింది తల్లి. డోర్ లోపల గడియ వేసి ఉంది. ఎంతసేపు కొట్టినా దివాకర్ తలుపు తియ్యలేదు. పక్కన కిటికీని తెరిచిన ఆమె... లోపలికి తొంగి చూసింది. షాకైంది. దివాకర్ ఫ్యాన్‌కి ఉరివేసుకొని వేలాడుతూ శవమై కనిపించాడు.

కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు వచ్చి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ గదిలో ఓ లేఖ దొరికినట్లుగా పోలీసులకు తెలిపారు తల్లిదండ్రులు. అందులో ఇలా ఉంది. "బోనులో ఉన్న చెరుకు గెడ ఇప్పుడు రిలీజైంది. ఇక దానికి ఎలాంటి అడ్డూ లేదు" అని ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో రాశాడు. "సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు" అని లేఖను ముగించాడు.

అతను ఓ కిల్లర్ గేమ్‌కి బానిసయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ గేమ్ ప్రకారం... దివాకర్ పేరు... బ్లాక్ బర్డ్ (నల్ల పక్షి). ఏదో టాస్క్ పూర్తి అయితే తప్ప ఆ గేమ్ పూర్తి కాదు. ఆ టాస్క్ పూర్తి అవ్వాలంటే దివాకర్ చనిపోవాలి. అందుకే అతను చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బ్లూ వేల్ లాంటి గేమ్‌కి దివాకర్ అలవాటు పడ్డాడని అతని బంధువులు, స్నేహితులూ తెలిపారు.

ఇలా ఓ గేమ్ అతని ప్రాణాలు తీసింది. మీరు కూడా మీ పిల్లలు మొబైల్స్‌లో ఏ గేమ్స్ ఆడుతున్నారో ఓ కన్నేసి ఉంచమంటోంది ఈ కేసు.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>