Home /News /crime /

ACTRESS DIED BY SUICIDE AFTER FAKE NCB OFFICERS DEMANDED RS 20 LAKH MAHA MINISTER MALIK CALLS IT NCB EXTORTION MKS

Actress suicide : డ్రగ్స్ కేసు భయంతో.. యువ నటి ఆత్మహత్య.. కానీ వాళ్లు ఫేక్ NCB

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చచ్చీచెడీ సగం డబ్బులు చెల్లించుకుంది. కానీ అసలు వాళ్లు ఎన్సీబీ అధికారులేకాదు.. ఆమెను డ్రగ్స్ కేసులో ఫ్రేమ్ చేసి, డబ్బులు గుంజడానికి స్నేహితులు కావాలనే ఆ పార్టీకి తీసుకెళ్లారు.. ఇదంతా తెలియకుండానే డ్రగ్స్ కేసు భయంతో ఆ నటి ఆత్మహత్య చేసుకుంది..

ఇంకా చదవండి ...
రంగుల కలను సాధించే క్రమంలో కొంత వరకు సక్సెస్ అయిది.. నటిగా ఇప్పుడిప్పుడే పేరొస్తోంది.. చేస్తోన్న ప్రాజెక్టులు విడుదలైతే ఆమె స్టార్ తిరిగేది కూడా. గత వారంతంలో స్నేహితులతో కలిసి ఓ రేవ్ పార్టీకి వెళ్లింది.. అనుకోకుండా ఆ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దాడి చేసింది.. డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే కెరీర్ ఉండదు కాబట్టి లంచమిస్తే వదిలేస్తామన్నారు దాడి చేసినవాళ్లు. చచ్చీచెడీ సగం డబ్బులు చెల్లించుకుంది. కానీ అసలు వాళ్లు ఎన్సీబీ అధికారులేకాదు.. ఆమెను డ్రగ్స్ కేసులో ఫ్రేమ్ చేసి, డబ్బులు గుంజడానికి స్నేహితులు కావాలనే ఆ పార్టీకి తీసుకెళ్లారు.. ఇదంతా తెలియకుండానే డ్రగ్స్ కేసు భయంతో ఆ నటి ఆత్మహత్య చేసుకుంది..

డ్రగ్స్ క్యాపిటల్ గా వార్తల్లో నిలించే ముంబై నగరంలో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ ఎన్సీబీ అధికారుల వేధింపుల వల్ల ఓ యువ నటి ఆత్మహత్యకు పాల్పడింది. నటి మృతిపై సాక్షాత్తూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేసిన దరిమిలా, ఇద్దరు నకిలీ రాయుళ్లను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నటిని పార్టీకి తీసుకెళ్లిన మరో ఇద్దరిపైనా పోలీసులు కేసు పెట్టారు. వివరాలివి..

Afghan మహిళల ప్రయాణాలపై కఠిన ఆంక్షలు.. మగ తోడు లేకుండా పోవద్దు: Taliban హుకుం



బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న ఓ యువ నటి(28) గత వారం(డిసెంబర్ 20న) ముగ్గురు స్నేహితులతో కలిసి ముంబైలోనే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీకి వెళ్లింది. అది రేవ్ పార్టీ అనే సాకుతో నకిలీ ఎన్సీబీ అధికారులు అక్కడ రెయిడ్ నిర్వహించారు. డ్రగ్స్ కేసులో పేరు బయటపెట్టకుండా ఉండాలంటే రూ.40 లక్షలు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు. తెలిసినవాళ్లందరికీ ఫోన్లు చేసి అతి కష్టం మీద రూ.20 లక్షలు సర్ది ఇచ్చింది. అయినా కూడా వదలకుండా మిగతా డబ్బుల కోసం నటిని వేధించారు నకిలీ ఎన్సీబీ అధికారులు.

Desmond Tutu : వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు టుటూ ఇకలేరు.. SA ఆర్చిబిషప్ మృతిపై pm modi విచారం



జరిగిన పరిణామాలతో కలత చెందిన ఆ నటి మనస్తాపంతో తన గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో సంచలన విషయాలు తెలిశాయి. నటిని పార్టీలో బెదిరించి, డబ్బులు గుంజింది నకిలీ వ్యక్తులని పోలీసులు గుర్తించారు. నటి మరణానికి కారణమైన సూరజ్ మోహన్ పరదేశి(38), పర్వీన్ రఘునాథ్ వాలింబేలను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో మరిన్ని చీకటి కోణాలు బయటికొచ్చాయి.

rtc bus : కదులుతోన్న ఆర్టీసీ బస్సులో మంటలు.. నడిరోడ్డుపైనే కాలి బూడిదైంది.. video



యువ నటిని పార్టీకి తీసుకెళ్లిన స్నేహితుళ్లో ఒకడి ప్లాన్ ప్రకారమే అక్కడ నకిలీ ఎన్సీబీ రైడ్ జరగడం, ఆమెను డ్రగ్స్ కేసులో ఫ్రేమ్ చేయడం, బెదిరింపుల వ్యవహారం సాగింది. సదరు స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి ఆత్మహత్యపై మంత్రి నవాబ్ మాలిక స్పందిస్తూ.. ఎన్సీబీలోని కొందరు మకిలి అధికారులు ప్రైవేట్ సైన్యాలను ఏర్పాటు చేసుకుని బాలీవుడ్ ప్రముఖులు, ఆర్టిస్టులను ఫేక్ కేసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఉదంతంలోనూ ఎన్సీబీ ప్రైవేటు సైన్యాల లింకులు, బెదిరింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Published by:Madhu Kota
First published:

Tags: Actress, Bollywood heroine, Drugs case, Suicide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు