ACTRESS ALLEGES MOLESTATION FOR TV ROLE IN PUNE OF MAHARASHTRA NK
టీవీ సీరియల్లో ఛాన్స్ ఇస్తామని ఆశ చూపి సినీ నటిపై అత్యాచారయత్నం?
ప్రతీకాత్మక చిత్రం
Maharashtra : పుణెలో ఎయిర్పోర్ట్ పోలీసులు... నాగపూర్‌కి చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. టీవీ సీరియల్లో ఓ పాత్ర చేసేందుకు ఛాన్స్ ఇస్తామని చెప్పి వారు సినీ నటిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
Maharashtra : బాలీవుడ్లో అడుగుపెట్టి... సినిమా అవకాశాలు అందుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఒక్క ఛాన్స్ దక్కినా చాలు టాలెంట్ చూపిస్తా అనుకుంటూ ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో ముంబై వచ్చి... కలల ప్రపంచంలో విహరిస్తుంటారు. ఆ 28 ఏళ్ల అమ్మాయి కూడా అలాగే అనుకుంటూ ముంబై వచ్చింది. ఓ ఫ్లాట్‌లో ఉంటూ... సినిమా ఆఫర్స్ కోసం తిరుగుతోంది. అలాంటి సమయంలో... ఓ షాపింగ్ మాల్లో ఆమెకు ఓ మహిళ తగిలింది. "ఇంత అందంగా ఉన్నావు... నీకు అవకాశాలు రాకపోవడమేంటి... ఓ పని చెయ్... నాకు ఓ సీరియల్లో డైరెక్టర్, ప్రొడ్యూసర్ తెలుసు... నిన్ను వాళ్లకు పరిచయం చేస్తాను. టీవీ సీరియల్లో క్లిక్ అయితే... ఆటోమేటిక్‌గా సినిమా అవకాశాలు వస్తాయి" అంది. ఆ వర్ధమాన నటి సరే అంది.
ఆ మహిళ చెప్పినట్లు... ఓ రోజు ముంబై నుంచీ పుణె వెళ్లింది. అక్కడ మహిళను కలిసింది. ఇద్దరూ కలిసి ఓ హోటల్లో రూం తీసుకున్నారు. రూంలో కూర్చున్నారు. ఆ తర్వాత ఆ మహిళ... ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనే వ్యక్తులకు కాల్ చేసింది. వాళ్లిద్దరూ అక్కడకు వచ్చారు. రాగానే మద్యం తెప్పించుకున్నారు. కాస్త కాస్త తాగుతూ (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)... "ఏజ్ ఎంత అని అడిగారు. 28 అని చెప్పింది. అంత ఏజ్ ఉంటే... సినిమాల్లో అవకాశాలు రావడం కష్టం. సీరియల్లో కూడా కష్టమేగానీ... మేం సర్దుబాటు చేస్తాం" అని ఆమెలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలా మాట్లాడారు.
ఆ తర్వాత ఆమెకు రెండు వైపులా ఇద్దరూ కూర్చున్నారు. ఆమెకు దగ్గరగా జరుగుతూ... ఓసారి ఛాన్స్ ఇస్తే... పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అన్నారు. దాంతో ఆ నటికి విషయం అర్థమైంది. "ఛీ... మీరింత దుర్మార్గులు అనుకోలేదు. ఏదో ఛాన్స్ ఇస్తారులే అని ముంబై నుంచీ పుణెకు వస్తే... పడుకోమంటారా" అంటూ ఫైర్ అయ్యింది. "ఏయ్... ఏంటి రెచ్చిపోతున్నావ్.... అవును... ఉత్తినే ఆఫర్ ఎవడిస్తాడు ఈ రోజుల్లో" అంటూ ఆమెపై రివర్స్ అయ్యారు. ఆమెకు ఒళ్లు మండింది "గుడ్ బై" అంటూ అక్కడి నుంచీ వెళ్లిపోతూ రూం డోర్ ఓపెన్ చెయ్యబోతుంటే... తలపై దడేల్ మని శబ్దం... బీర్ బాటిల్ బద్ధలైంది. ఆ ఇద్దరిలో ఒకడు ఆమె తలపై బాటిల్‌తో కొట్టాడు. దాంతో ఆమె షాకైంది. వెంటనే మరొకడు ఆమెను చెయ్యి పట్టుకొని బెడ్‌పై లాగుతుంటే... ఆమె గట్టిగా విదిలించుకుంది. ఇంతలో బాటిల్‌తో కొట్టిన వాడు ఆమెను వెనక నుంచీ పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే... ఆమె మరింత గట్టిగా విదిలించుకుంటూ... వదిలించుకుంటూ... మొత్తానికి ఆ నరకం నుంచీ బయటపడి.... పరుగులు పెట్టింది.
ఆ తర్వాత పుణె పోలీసుల్ని కలిసి విషయం చెప్పింది. ఆమె ద్వారా అంతా డీటెయిల్డ్‌గా తెలుసుకున్న పోలీసులు... వాళ్ల కోసం హోటల్‌కి వెళ్లారు. అప్పటికే ముగ్గురూ పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ల కోసం పోలీసులు వేటాడుతున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.