Actor Amreena Bhat shot dead : జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. నిత్యంలో ఏదొక చోట భయోత్పాతం సృష్టిస్తున్నారు. కొన్ని రోజులుగా బరితెగించి బహిరంగంగా ఇళ్లపైనే పడి కాల్పులు జరుపుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఓ పోలీసు కానిస్టేబుల్‌ను అతని ఏడేళ్ల కూతురు కళ్ల ఎదుటే కాల్చి చంపిన ఘటన మరువక ముందే మరోసారి అలాంటి ఘాతుకానికే పాల్పడ్డారు. పదేళ్ల వయస్సు ఉన్న తన మేనల్లుడితో కలిసి ఇంటి బయట ఉన్న ఓ టీవీ నటిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అమ్రీన్ భట్(35) అనే టీవీ నటి ప్రాణాలు కోల్పోయింది.
బూద్గామ్ జిల్లాలోని చదూర ప్రాంతంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న అమ్రీన్ భట్(Amreena Bhat),ఆమె మేనల్లుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన అమ్రీన్ భట్ ని హాస్పిటల్ కి తరలించగా.. పరిస్థితి విషమించడంతో ఆమె మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు అని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. అమ్రీన్ భట్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యారు. ఇక ఈ ఘటనలో ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబీర్‌కు కూడా బుల్లెట్ గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. చేతిలో బుల్లెట్ గాయంతో ఉన్న బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. చాదూరా హాస్పిటల్ లో బాలుడు ట్రీట్మెంట్ పొందుతున్నాడని చెప్పారు. అయితే సంఘటన తర్వాత అమ్రీనాను కూడా చదూరా ఆసుపత్రికి తీసుకెళ్లారు మరియు ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్‌లోని SMHS హాస్పిటల్ కి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. ఈ దారణం తెలిసిన వెంటనే.. గుప్కర్ కూటమి ఆమె మృతికి సంతాపం తెలిపింది. ఆంబ్రీన్ భట్‌పై జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడితో తాను ఎంతో దిగ్భ్రాంతి చెందామని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్ లో తెలిపారు.
ALSO READ Woman Find Diamond : అదృష్టమంటే నీదేనమ్మా..మహిళకు దొరికిన వజ్రం..రాత్రికి రాత్రే లక్షాధికారి
ఇక,ఈ కాల్పులు... నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల పనేనని పోలీసులు తెలిపారు. ముష్కరుల్ని పట్టుకొనేందుకు ముమ్మరంగా గాలింపు ప్రారంభించినట్టు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
కాగా, జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో మరణించారు. ఈ ఘటనలో ఓ పోలీసు కూడా వీర మరణం పొందారు. బారాముల్లా జిల్లాలోని క్రీరీ ప్రాంతం నజీభట్ క్రాసింగ్‌లోని ఓ చెక్‌పోస్టు వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగిందిterror
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Jammu and Kashmir, Terrorists, WOMAN