హోమ్ /వార్తలు /క్రైమ్ /

Drugs Case: డ్రగ్స్ కేసులో.. స్టార్ హీరోయిన్ సోదరుడు అరెస్ట్

Drugs Case: డ్రగ్స్ కేసులో.. స్టార్ హీరోయిన్ సోదరుడు అరెస్ట్

శ్రద్ధకపూర్ సోదరుడు అరెస్ట్

శ్రద్ధకపూర్ సోదరుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ సేవిస్తూ.. పట్టుబడటం.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాాట్ టాపిక్‌గా మారింది.

సినీ ఇండస్ట్రీని డ్రగ్స్ (Drugs) కుదిపేస్తోంది. ఎప్పటికప్పుడు పోలీసులు జరిపిన దాడుల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు అరెస్ట్ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి నగరంలో జరిగిన ఓ పార్టీలో డ్రగ్స్ సేవించిన ఆరోపణలపై బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను బెంగళూరు (Bangalore) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పక్కా సమాచారంతో పోలీసులు ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ (Drugs) సేవిస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేశారు. అయితే పార్టీలో ఉన్నవారు డ్రగ్స్ సేవించి పార్టీకి వచ్చారా లేక హోటల్‌లో సేవించారా అనే దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.  బెంగళూరులోని ఎంజీ రోడ్డులో ఉన్న ఈ హోటల్‌లో పార్టీపై పోలీసులు కన్నేసి ఉంచినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పార్టీ ప్రారంభం అయిన చాలా సేపటి తర్వాత పోలీసులు దాడులు చేశారు. ఈ పార్టీలో చా లా మంది పాల్గొన్నప్పటికీ సిద్ధాంత్ కపూర్‌ సహా మరో ఆరుగురిపై అనుమానం ఉండడంతో వీళ్లను మాత్రమే అదుపులోకి తీసుకుని పరీక్షలు జరిపించినట్లు తెలుస్తోంది.

అయితే, వీళ్లు డ్రగ్స్ సేవించే పార్టీకి వచ్చారా? లేక పార్టీలోనే డ్రగ్స్‌ను తీసుకున్నారా అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందుకోసం హోటల్ యాజమాన్యాన్ని, పార్టీకి హాజరైన పలువురిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. పోలీసుల విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశంఉంది. ఇక పోతే బాలీవుడ్ టాప్ హీరోయిన్లో ఒకరైన శ్రద్దా కపూర్ సోదరుడైన సిద్దాంత్ కపూర్.. కూడా సినిమాల్లో నటించారు. అతడు 1997లో వచ్చిన 'జుడ్వా' అనే సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారి ఎన్నో సినిమాలకు పని చేశాడు.

ఈ క్రమంలోనే 2013లో వచ్చిన 'షూటౌట్ ఎట్ వాడాలా' అనే సినిమాతో నటుడిగా మారాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే 'అగ్లీ', 'హసీనా పార్కర్', 'పల్టన్', 'యారమ్', 'హలో చార్లీ' వంటి సినిమాల్లో నటించాడు. అలాగే, 'భవుక్కల్' అనే వెబ్ సిరీస్‌లో కూడా సిద్ధాంత్ కపూర్  భాగం అయ్యాడు. వీటితో పాటు కొన్ని మ్యూజిక్ ఆల్బమ్‌లను కూడా చేశాడు. మరోవైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushanth Singh Rajput) మరణించిన కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించిన వారిలో నటి శ్రద్ధా కపూర్ కూడా ఉన్నారు.

First published:

Tags: Bollywood drugs case, Drug case, Saaho, Shradda kapoor

ఉత్తమ కథలు