Actor Naveen Reddy Atluri | టాలీవుడ్ హీరో నవీన్‌రెడ్డి అట్లూరిని రెండు రోజులక్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నవీన్ రెడ్డి (Actor Naveen Reddy Atluri) రూ.55 కోట్ల మేర మోసం చేశారని ఎన్ స్క్వైర్ కంపెనీ డైరెక్టర్లు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. అయితే గత రెండు రోజులుగా సీసీఎస్ పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు నవీన్ రెడ్డి. 38 కోట్ల మోసానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఎన్ స్క్వైర్ కంపెనీకి నవీన్ రెడ్డి అట్లూరి గతంలో డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో మిగితా డైరెక్టర్స్‌కు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టుపెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన మిగిలిన డైరెక్టర్లు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బటయపడ్డింది. నవీన్ రెడ్డి రూ. 55 కోట్ల మేర మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నవీన్ రెడ్డి ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరుపైకి మార్చుకున్నాడు. అంతేకాదు భూ విక్రయాలకు పాల్పడట్లు తెలుస్తోంది.
గతంలో ఎన్ స్వ్కేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేసిన నవీన్ రెడ్డి కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టారరు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఇతర డైరెక్టర్స్‌కు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు నవీన్ రెడ్డిపై 420, 465,468,471 r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత రెండు రోజులుగా పోలీసుల విచారణలో నవీన్ రెడ్డి ఫోర్జరీ చేసినట్లు అంగీకరించాడు. మోసం చేసిన డబ్బులతో నవీన్ జల్సాలు చేశాడని తెలుస్తోంది. నవీన్ రెడ్డు తానే హీరోగా నోబడీ అనే సినిమా కూడా తీశాడు. నవీన్ రెడ్డి, సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెంకు చెందినట్లు తెలుస్తోంది. గతంలో బైక్ దొంగతనం కేసులు కూడా ఉన్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Tollywood news