news18-telugu
Updated: August 28, 2019, 6:25 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచవ్యాప్తంగా ‘మీటూ’ ఏ విధంగా ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ వ్యవహారం రచ్చ రచ్చ చేసింది. తాజాగా అలాంటి ఘటనే సినీ పరిశ్రమలో పునరావృతం అయ్యింది. మైనర్‌ను బికినీ ధరించాలని ఒత్తిడి చేసి, ఆమెను అసభ్యంగా ప్రైవేటు అవయవాల దగ్గర తాకాడో నటుడు. ఈ ఘటన జూలై 16న మరాఠీ సినీ పరిశ్రమలో చోటు చేసుకుంది. మందార్ సంజయ్ కులకర్ణి(34) అనే నటుడు.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అయితే, తాను ఓ సినిమా తీస్తున్నానని.. అందులో ఓ కేరెక్టర్ కోసం అమ్మాయిలు కావాలని ప్రకటన ఇచ్చాడు. అది చూసిన ఓ యువతి(17) అతడి దగ్గరకు వెళ్లింది. నాలుగు రకాల దుస్తుల్లో ఫోటో షూట్ చేసిన కులకర్ణి.. బికినీ ధరించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె తన తల్లిదండ్రులను అడగాలని చెప్పగా.. ఆ అవసరం ఏమీ లేదని ఒప్పించాడు. సరేనని బికినీ ధరించిందామె. ఫోటో షూట్ అని చెబుతూ ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ఎక్కడెక్కడో తాకాడు. దగ్గరకు తీసుకొని సెల్ఫీలు తీసుకున్నాడు.
అతడి నుంచి తప్పించుకున్న యువతి.. రూమ్‌లోకి వెళ్లి బట్టలు మార్చుకుంది. అక్కడికి కూడా వచ్చిన కులకర్ణి ఆమె శరీర కొలతలను చూసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడి నుంచి తప్పించుకొని పారిపోయిన బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన ఉదంతాన్ని తల్లికి వివరించింది. ఎవరికి చెప్పాలో తెలీక తమలో తామే కుమిలిపోయారు. ఈ నెల 22న స్థానిక లాయర్ల సహాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
August 28, 2019, 5:28 PM IST