ACTOR DEEP SIDHU ARRESTED FOR INSTIGATING RED FORT VIOLENCE DURING FARMERS TRACTOR RALLY ON REPUBLIC DAY SU
Deep Sidhu Arrested: ఎర్రకోట హింస.. నటుడు దీపు సిద్దూ అరెస్ట్.. ఎక్కడ చిక్కాడంటే..?
దీప్ సిద్ధు (ఫైల్ ఫొటో)
పంజాబీ నటుడు దీప్ సిద్దూను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ర్యాలీ సందర్భంగా దీప్ సిద్దూ హింసను ప్రేరేపించారనే ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
పంజాబీ నటుడు దీప్ సిద్దూను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ర్యాలీ సందర్భంగా దీప్ సిద్దూ హింసను ప్రేరేపించారనే ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు పంజాబ్‌లోని జికార్పూర్లోని దీప్ సిద్దూను మంగళవారం అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. జనవరి 26న చేపట్టిన ర్యాలీలో రైతులను నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఎర్రకోట వైపు తీసుకెళ్లడంలో దీప్ సిద్దు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పలు ప్రత్యేక బృందాలు అతడి కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే దీప్ సిద్దు గురించి సమాచారం తెలిపిన వారికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం అంజేస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలోనే దీప్ సిద్దూ కాలిఫోర్నియోలోని ఓ ఫ్రెండ్‌కి వీడియోలు పంపుతాడని.. అక్కడ వారు ఫేస్బుక్లో ఆ వీడియోలు అప్లోడ్ చేస్తారని గుర్తించినట్టు స్పెషల్ సెల్ డీసీపీ తెలిపారు. అందువల్లే తాము అతని ప్రస్తుత ఐపీ అడ్రస్‌ను గుర్తించలేకపోయామని పోలీసులు తెలిపారు.
ఇక, జనవరి 26న ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించగా.. కొందరు నిరసనకారులు పోలీసులు నిర్దేశించి మార్గాల్లో కాకుండా వేరే మార్గాల్లో ఢిల్లీకి ప్రవేశించారు. పలు ప్రాంతాల్లో పోలీసు వాహనాలతో పాటు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడులు చేశారు. అంతేకాదు ఎర్రకోటపై జెండాలను ఎగురవేశారు. ఐతే రైతులను నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఎర్రకోట వైపు తీసుకెళ్లడంలో దీప్ సిద్దూ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. జనవరి 25న కూడా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని.. ఆయన వల్లే ఎర్రకోటను ఆందోళనకారులు ముట్టడించారని ఆరోపణలు వచ్చాయి. రైతు సంఘాల నుంచి విమర్శలు రావడంతో ఆ మరుసటటి దీప్ సిద్దు స్పందించారు. ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ ప్లాగ్‌ను మాత్రమే ఎగురవేశామని తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని తొలగించలేదని, ఖాళీ పోస్ట్‌పైనే జెండాలు ఎగురవేశామని చెప్పారు. నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అని.. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత నుంచి దీప్ సిద్దు కనిపించకుండా పోయాడు.
ఇక, ఈ హింసకు సంబంధించి పలు కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల జాబితాను సిద్దం చేశారు. ఇప్పటికే 100 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే దీప్ సిద్దుతో పాటు జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుజ్రంత్ సింగ్‌ని పట్టిస్తే రూ. లక్ష క్యాష్ రివార్డ్ ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఇక జజ్బీర్ సింగ్, బుటా సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ ఎక్కడ ఉన్నారో చెబితే రూ. 50వేలు అందజేస్తామని తెలిపారు.