Bihar: కొందరు మహిళలు ఆడతనానికే మచ్చ తీసుకువస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా.. పరాయి మగాళ్లతో ఎఫైర్ లు పెట్టుకుని తమ కుటుంబపు పరువును బజారుకు ఈడ్చుకుంటున్నారు.
Extra marital Affair Bihar Woman Tied To Pole: ప్రస్తుతం కొందరు మూడు ముళ్ల బంధానికి ఉన్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. పెళ్లి చేసుకుని క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు (Extra marital affair) పెట్టుకుంటున్నారు. అదే విధంగా పురుషులు కూడా భార్యకు గుట్టుచప్పుడు కాకుండా ఎఫైర్ లు సాగిస్తున్నారు. మరికొన్ని చోట్ల బహిరంగంగానే ప్రేమయాణాలు సాగిస్తున్నారు. కొందరు వ్యక్తులు.. తాము పనిచేసే చోట, మహిళలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల.. మహిళలు తమ అవసరాల కోసం ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని వారితో ఎఫైర్ లు (Affairs) కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు తరచుగా వార్తలలో నిలుస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. బీహర్ లో (Bihar woman affair) ఒక మహిళ సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించింది. రోహతస్ జిల్లాలో ఈ ఉదంతం జరిగింది. దీపక్ రామ్ కు ఒక మహిళతో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. అయితే, సదరు వివాహిత అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఎఫైర్ (Illegal affair) పెట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఆమెను పలుమార్లు హెచ్చరించారు. భర్త.. పద్దతి మార్చుకోవాలని తన భార్యకు సూచించాడు. కానీ భార్య తన వంకర బుద్ధి మార్చుకోలేదు. ఒక రోజు తన ప్రియుడిని కలవడానికి వెళ్లింది.
దీంతో ఆమెను కుటుంబ సభ్యులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. దీంతో వారు కోపంతో రగిలిపోయారు. వెంటనే ఆమెను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో వివాహిత (married woman affair) ఇంటికి చేరుకోగానే.. భర్త కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. భర్త దీపక్ రామ్, అతని తండ్రి శివపూజన్ రామ్, మరో ముగ్గురు కలిసి ఆమెను ఇంటి ఎదుట కరెంట్ స్తంభానికి (Bihar woman tied pole) కట్టేశారు. ఆ తర్వాత.. ఆమెను చితక్కొట్టారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మహిళ భర్తతో పాటు, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.