Woman Tied To Pole Beaten Up : మానవత్వం మంట కలిసిపోతుంది.. దాంపత్యాలు కూలుతున్నాయి. వివాహేతర సంబధాలతో హత్యలకు వెనకాడడం లేదు. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు,అనుబంధాలు, రాగాలు, అనురాగాలు మంటగలసి పోతున్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు వేలం వెర్రిగా బయటపడుతున్నాయి. అన్నింట్లోనూ వివాహేతర సంబంధాలదే ప్రధాన భూమికగా మారింది. తాత్కాలిక సంతోషం, సుఖం కోసం ఎంతో మంది వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధం అన్నది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే అయినప్పటికీ దాని ఫలితాలు, పర్యవసానాలు ఎన్నో జీవితాలతో ముడిపడి ఉంటాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదు. కొన్ని నిమిషాల ఆనందం కోసం జీవితాన్ని, కుటుంబాన్నే పనంగా పెడుతున్నారు. ఇటీవల కాలంలో ఒకటి... రెండు కాదు.. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో హత్యలు జరిగాయి. వీటివల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. అయితే తాజాగా వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను కరెంట్ పోల్ కి కట్టేసి చావగొట్టాడు ఓ భర్త. బీహార్ రాష్ట్రంలోన రోహతస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని మరో వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని,ఎన్నిసార్లు చెప్పినా తన మాట వినలేదని,అందుకే ఇలా చేసినట్లు భర్త చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
రోహతస్ జిల్లాలోని సింగ్పూర్ గ్రామానికి చెందిన దీపక్ రామ్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే హాయిగా సాగిపోతున్న కాపురంలో వివాహేతర సంబంధం అనుమానం మొదలైంది. కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనలో తేడా గమనించాడు దీపక్ రామ్. తన భార్య గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించాడు. ఇదే విషయమై పలుమార్లు భార్యను నిలదీశాడు. ఈ విషయమై అనేకసార్లు భార్యా,భర్తల మధ్య గొడవ జరిగింది. అయితే తన బాధను తల్లిదండ్రుతె చెప్పుకున్నాడు దీపక్ రామ్. కుమారుడిని ఎలా ఓదార్చోలా తెలియక కన్నవాళ్లు తల పట్టకున్నారు.
ALSO READ Covid Deaths : కరోనాతో ఎక్కువగా చనిపోయింది భారతీయులే..WHO తాజా రిపోర్ట్ లో సంచలన విషయాలు!
ఇదే క్రమంలో గత శుక్రవారం భార్య,భర్తల మధ్య గొడవ తీవ్రమైంది. దీంతో దీపక్ రామ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి..తన విషయం గురించి చెప్పి జోక్యం చేసుకోవాలని కోరాడు. దీంతో దంపతులను స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు పోలీసులు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) పోలీస్ స్టేషన్‌లో దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారని అధికారులు తెలిపారు. అయితే, వారి గ్రామం సింగ్‌పూర్‌కు చేరుకున్న తర్వాత, దీపక్ రామ్, అతని తండ్రి శివపూజన్ రామ్ మరియు ఇతర ముగ్గురు కుటుంబ సభ్యులు మహిళను తమ ఇంటి వెలుపల ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టివేసి, ఆమెను దారుణంగా కొట్టారు. అయితే స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం మహిళను రక్షించిందని రోహ్తాస్ పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ భారతి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె భర్త, బావమరిదితో సహా ఐదుగురిని అరెస్టు చేశామని భారతి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Extra marital affair, WOMAN