• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • ACCUSED IN TAHASILDAR VIJAYAREDDY MURDER SURESH HEALTH CONDITION VERY CRITICAL TREATMENT GOING ON IN OSMANIA HOSPITAL AK

తహశీల్దార్ హత్య... అత్యంత విషమంగా నిందితుడు సురేష్ ఆరోగ్యం

తహశీల్దార్ హత్య... అత్యంత విషమంగా నిందితుడు సురేష్ ఆరోగ్యం

విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్(ఫైల్ ఫోటో)

తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

  • Share this:
    తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసుకున్న సురేష్... ఈ క్రమంలో తనపై కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కాలిన గాయాలతో ఉన్న సురేష్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 65 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేష్‌కు ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం సురేష్ న్యూరోబర్న్ షాక్‌లో ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. అయితే బుధవారం సురేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు తెలిపారు.

    అంతకుముందు నిందితుడు సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. కొంతకాలంగా భూ పట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని సురేష్ తెలిపాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని అన్నాడు. ఈ కారణంగానే ఆమెపై కక్ష పెంచుకున్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. లీటర్ పెట్రోల్ కొనుక్కుని బ్యాగ్‌లో ముందే పెట్టుకున్నానని అన్నాడు.

    మరోసారి భూపట్టా కోసం విజయారెడ్డిని వేడుకున్నానని... పట్టాలేదని చెప్పడంతో పెట్రోల్ పోసి తగులపెట్టానని వివరణ ఇచ్చాడు. అయితే సురేష్ నుంచి మరోసారి వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. ఇందుకోసం మేజిస్ట్రేట్ స్థాయి అధికారి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. విజయారెడ్డి హత్య సందర్భంగా తీవ్రంగా గాయపడిన ఆమె కారు డ్రైవర్ గురునాథం నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.




    First published: