కానిస్టేబుల్ కాలు కొరికాడు... అడ్డంగా బుక్కయ్యాడు...

Telangana | Hyderbad : ఊహించని పరిణామంతో పోలీసులు షాక్ అయ్యారు. అతనికి పిచ్చి గానీ ఉందేమో అనుకున్నారు. కోపం ఎక్కువగా ఉందని అర్థమైంది.

news18-telugu
Updated: February 20, 2020, 12:09 PM IST
కానిస్టేబుల్ కాలు కొరికాడు... అడ్డంగా బుక్కయ్యాడు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Telangana | Hyderbad : అరెస్టు వారెంట్ జారీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఎవరైనా దాడి చేస్తారా? అలాంటి ఘటన.. హైదరాబాద్... అమీర్‌పేటలో జరిగింది. యూసఫ్‌గూడ.. కృష్ణకాంత్ పార్క్ దగ్గర్లో ఉంటున్నాడు నిందితుడు శ్రీనివాస్ గోపీచంద్. ఇతనిపై 2019లో జూబ్లీహిల్స్ పోలీస్ ‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు వారెంట్ జారీ చేసేందుకు స్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్ విష్ణు... శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. టక్ టక్ మని తలుపు కొట్టాడు. ఈ టైంలో ఎవర్రా బాబూ అనుకుంటూ శ్రీనివాస్ తలుపు తీశాడు. ఎదురుగా పోలీసు. పదరా స్టేషన్‌కి అన్నాడు. అంతే శ్రీనివాస్‌కి పిచ్చి కోపంతో ఊగిపోయాడు. నేను స్టేషన్‌కి రావాలా... నన్ను అరెస్టు చేస్తారా... అంటూ... కిందపడి గిలగిలా కొట్టుకుంటూ... కానిస్టేబుల్ కాలిని గట్టిగా కొరికేశాడు. అమ్మా అంటూ కానిస్టేబుల్ గట్టిగా అరిచారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు శ్రీనివాస్. వెంటనే కానిస్టేబుల్ తన ఇతర సిబ్బందికి కాల్ చేశారు. వాళ్లు వచ్చిన తర్వాత శ్రీనివాస్‌ని గట్టిగా పట్టుకొని... అరెస్టు చేసి... పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

తాజా ఘటనలో... బాధితుడు కానిస్టేబుల్ విష్ణు... శ్రీనివాస్‌పై SR నగర్‌ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాస్‌కి మానసికంగా ఎలాంటి సమస్యా లేదనీ, అతను కావాలనే కక్షపూరితంగా ఈ దాడి చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పుడు శ్రీనివాస్‌పై రెండు కేసులున్నాయి. ఒకటి చీటింగ్, రెండోది కానిస్టేబుల్‌పై దాడి. ఏది ఏమైనా... ఇలా పోలీసు కాలినే కొరికేయడంతో అందరూ షాకైన ఘటనగా ఇది నిలిచింది.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు