యూపీ ఎన్నికల నేపథ్యంలో మీరట్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీ వెళ్తుండగా ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసందే.. దీంతో నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. వారిని విచారణ చేశారు. దీంతో ఓవైసీని చంపాలనే ఉద్దేశ్యంతోనే కాల్పులు జరిపినట్టు అంగీకరించినట్టు చెప్పారు. నిందితుల్లో ఒకరు తానో రాజకీయ నాయకుడిన కావాలనుకున్నానని, కాని ఒవైసీ రెచ్చగొట్టె ప్రసంగాలు విని ఆవేదన చెందానని అందుకే తన శుభమ్ అనే స్నేహితుడితో కలిసి ఒవైసీ హత్యకు పథకం వేసినట్టు అంగీకరించారు. ముందుగానే స్కెచ్ వేసి కాల్పులు జరిపినట్టు చెప్పారు. కాగా ఒవైసీపై కాల్పులు జరిపిన నేపథ్యంలోనే ఆయన కారులోనే కిందకు వంగాడని చెప్పాడు. అయితే అందుకే కారు కిందవైపు కాల్పులు జరిపామని ఆయనకు బుల్లెట్లు తగిలాయనుకున్నామని, ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయినట్టు చెప్పారు.
కాగా ఒవైసీపై కాల్పులకు ముందుగానే రెక్కి నిర్వహించారని, సమావేశాల్లోనే కాల్పులు జరపాలని భావించి ఆయన సమావేశాలకు కూడా వెళ్లినట్టు చెప్పారు. కాని ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో సాధ్యపడలేదని, ఒవైసీ మీరట్ నుండి ఢిల్లీకి వెళతారని తెలుసుకుని ముందే టోల్‌గేట్ వద్దకు చేరుకున్నట్టు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.
Theft : అమ్మ ఆసుపత్రిలో ఉండగా పెళ్లి కోసం దాచిన డబ్బు, బంగారం మాయం..
కాగా మహాత్మగాంధీని హత్య చేసిన వారే తనపై దాడి చేశారని ఒవైసీ అన్నారు. కాల్పుల తర్వాత యూపీ ఎన్నికల ప్రచారంలో మొదటి సారి పాల్గొన్న ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. దుండగులు తనపై కాల్పులు జరిపినా అల్లదయతో బయటపడ్డానని, అల్లా రక్షించాలనుకున్నప్పుడు ఎవరు తనను చంపలేరని అన్నారు.
ఆయనపై దాడి తర్వాత తక్షణమే సీఆర్‌పీఎఫ్ బలగాలతో జడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, తనకు జడ్ కేటగిరీ భద్రత అక్కర్లేదన్న అసద్.. అందరిలాగే తాను 'ఏ కేటగిరీ' పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు. కాల్పులు జరిపిన వారిని చూసి తాను ఏమాత్రం భయపడనన్నారు. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్ ద్వారా సమాధానం ఇస్తారని.. యూపీలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asaduddin Owaisi, Hyderabad