పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab national bank). గత ఏడాదిన్నరగా దేశంలో మారుమోగుతున్న బ్యాంకు పేరు. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు బయటపడటంతో దేశవ్యాప్తంగా పలువురు ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కిన సంగతి తెలసిందే. అయితే ప్రభుత్వం, ఆర్బీఐ (RBI) అందరికీ భరోసా నివ్వడంతో నిరసనలు తగ్గాయి. కాగా, మరోసారి పంజాబ్ నేషనల్ బ్యాంకు వార్తల్లో నిలిచింది. ఈసారి బ్యాంకు సర్వర్ (bank server)లో లోపం బయటపడటంతో ఖాతాదారులను ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు 18 కోట్ల మంది ఖాతాదారులకు సంబంధించిన సమాచారం ఏడు నెలలుగా లీక్ (bank accounts data leak) అవుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ ఎక్స్9 (Cyber x9)ప్రకటించింది. బ్యాంక్‌కు సంబంధించిన డిజిటల్ బ్యాంకింగ్ (digital banking)కు వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్ చేసే అవకాశాన్ని సర్వర్‌లోని లోపం కల్పించిందంటోంది సైబర్ ఎక్స్9. అయితే, సర్వర్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నా.. అకౌంట్ హోల్డర్స్ (account holders)కు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కలేదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటోంది. ముందస్తు చర్యల్లో భాగంగా సర్వర్‌ను షట్‌డౌన్ చేశామంటోంది.
ముందస్తు చర్యల్లో భాగంగా సర్వర్ షట్‌డౌన్..
సైబర్ ఎక్స్9 ఎండీ హిమాన్షు పాతక్ మాట్లాడుతూ.. ఖాతాదారుల సమాచారం లీక్ (bank accounts data leak) అయిన విషయాన్ని CERT-In, NCIIPCకి కూడా తెలియజేశామన్నారు. సైబర్ దాడులకు వీలు కల్పించే విధంగా ఈ లోపం ఉందని, అడ్మిన్ యాక్సెసబిలిటీ సైతం అందించే విధంగా ఈ లోపాన్ని పాతక్ గుర్తించామన్నారు. కాగా, పంజాబ్నేషనల్ బ్యాంక్ స్పందిస్తూ.. ఆన్-ప్రిమ్ నుంచి ఆఫీస్ 365 క్లౌడ్‌లోకి ఈ-మెయిల్స్‌ను రూట్ చేయడానికి మాత్రమే ఆ సర్వర్‌ను వినియోగిస్తున్నామంది. సైబర్ ఎక్స్9 చెప్పినట్లుగా ఖాతాదారుల డేటా లీక్ (bank accounts data leak) అవ్వడం తప్పంటోంది. ఎప్పటికప్పుడు Cert-in ఎంప్యానెల్డ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్లు తనిఖీ చేస్తూనే ఉన్నారని PNB అధికారులు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా సర్వర్‌ను షట్‌డౌన్ చేశామన్నారు అధికారులు.
అంతర్గత సర్వర్లకు
ఖాతాదారుల సమాచారం బయటపడటంపై సైబర్ఎక్స్ 9 వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడారు.. ‘‘మేం దీని గురించి ఫిర్యాదు చేయనంత వరకు బ్యాంక్ ప్రశాంతంగా నిద్రపోతోంది. దాదాపు ఏడు నెలల పాటు 180 మిలియన్ల కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక డేటా బయటే ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్‌లోని తీవ్రమైన లోపాన్ని మా బృందం బయటపెట్టిందని ఆయన అన్నారు. అంతర్గత సర్వర్ (Internal server)కు యాక్సెస్‌ని అందించిన ఈ లోపం కారణంగా అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణ రాజీ పడింది. ఇంటర్నల్ సర్వర్ యాక్సెస్ కారణంగా కస్టమర్ల డేటా ఇంత పెద్ద ఎత్తున రాజీ పడింది.
ఖండించిన పీఎన్బీ..
సైబర్ X9 చేసిన ఆరోపణలను PNB తీవ్రంగా ఖండించింది. సాంకేతిక లోపం నిజమేనని.. అయితే ఒక్క కస్టమర్ వ్యక్తిగత లేదా ఆర్థిక డేటా కూడా లీక్ కాలేదని ఆయన స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సర్వర్ షట్ డౌన్ చేయబడిందని వెల్లడించింది. సైబర్ X9 ఈ లోపం గురించి NCIIPCకి తెలియజేసిందని తెలిపింది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.