హైదరాబాద్ కూకట్‌పల్లిలో కారు బీభత్సం.. ఒకరి మృతి

Hyderabad Accident: మియాపూర్ నుంచి అమీర్‌పేట వైపు వెళుతున్న కారు.. రోడ్డు దాటుతున్న ఇద్దరినీ ఢీ కొట్టింది.

news18-telugu
Updated: September 4, 2020, 5:39 PM IST
హైదరాబాద్ కూకట్‌పల్లిలో కారు బీభత్సం.. ఒకరి మృతి
యాక్సిడెంట్‌‌లో దెబ్బతిన్న కార్లు
  • Share this:
Accident in Hyderabad: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మియాపూర్ నుంచి అమీర్‌పేట వైపు వెళుతున్న కారు.. రోడ్డు దాటుతున్న ఇద్దరినీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇద్దరినీ ఢీ కొట్టిన తరువాత కారు డ్రైవర్ మరింత వేగంగా కారు నడిపాడు. ఈ క్రమంలో మరిన్ని యాక్సిడెంట్లకు కారణమయ్యాడు. అతివేగంతో ఇద్దరిని ఢీ కొట్టిన కారు... ఆ తరువాత మరో కారుతో పాటు ఓ ఆటో, బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాదంలో కారులోని వారికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధ్యులపై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: September 4, 2020, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading