అనంతపురం డీఎంహెచ్‌వో ఆఫీసుపై ఏసీబీ దాడులు

అనంతపురం డీఎంహెచ్‌వో ఆఫీసుపై ఏసీబీ దాడులు

కార్యాలయంలో ఏసీబీ దాడులు

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన అంశాలపై అవినీతి ఆరోపణలు రావడంతో అనంతపురంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది.

  • Share this:
    కరోనా వైరస్ నేపథ్యంలో మందుల కొనుగోళ్లు, ఉద్యోగుల భర్తీపై పలు ఆరోపణలు రావడంపై ఏసీబీ దృష్టి పెట్టింది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన అంశాలపై అవినీతి ఆరోపణలు రావడంతో అనంతపురంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. అడ్మినిష్ట్రేషన్ ఆఫీసర్ రత్నాకుమార్ ఛాంబర్ రికార్డులు పరిశీలించింది. ఈ సమయంలో కార్యాలయం నుంచి వెళ్లిపోవడానికి డీఎంహెచ్ఓ అనిల్ కుమార్ ప్రయత్నించారు. అయితే ఆయనను ఏసీబీ అధికారులు అడ్డుకున్నారు. కార్యాలయంలోని అన్ని రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్ ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: