Keesara Tahasildar: నాగరాజు బినామీలు ‘ఘనులే’.. లాకర్లలో బంగారమే బంగారం

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ నాగరాజు పాపాల చిట్టా పెరిగిపోతున్నది. ఆయన బినామీలుగా చెప్పుకుంటున్న వారి ఖాతాల్లో బంగారం రాశులు కిలోల చొప్పున బయటపడింది.

news18
Updated: October 23, 2020, 8:01 AM IST
Keesara Tahasildar: నాగరాజు బినామీలు ‘ఘనులే’.. లాకర్లలో బంగారమే బంగారం
ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి నగలు
  • News18
  • Last Updated: October 23, 2020, 8:01 AM IST
  • Share this:
కీసర తహసీల్దార్, లంచావతారి నాగరాజు కేసులో ఊహించని నిజాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఆయన అవినీతి ఆస్తులను భారీగా గుర్తించిన పోలీసులు.. తాజాగా ఆయన బినామీల లాకర్లను వెతకగా.. అవి చూసి వారు ఖంగుతిన్నారు. నాగరాజు బినామీలుగా చెప్పుకుంటున్న ఆయన క్లాస్ మేట్ పి.జె.మహేంద్రకుమార్, ఆయన సోదరుడు నందగోపాల్ బ్యాంకు ఖాతాలను అవినీతి నిరోధక శాఖ బృందం సభ్యులు గురువారం తనిఖీ చేశారు. కాగా, వారిరువురి లాకర్లలో రూ. 65 లక్షల విలువైన 1.25 కేజీల బంగారు ఆభరణాలతో పాటు 7.29 కిలీల వెండి బిస్కెట్లు లభ్యమయ్యాయి.

తనిఖీలలో భాగంగా అల్వాల్, మేడ్చల్ ఐసీఐసీఐ బ్యాంకులలోని నిందితుల లాకర్లను అవినీతి శాఖ అధికారులు తనిఖీ చేశారు. కాగా, వారి లాకర్లలో కేజీన్నర బంగారు ఆభరణాలతో పాటు రూ. 4.5 లక్షల విలువ కలిగిన 7.29 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. వెండి ఆభరణాల కంటే బిస్కెట్ల (35) రూపంలో ఎక్కువగా ఉంది. ఇవే గాక మరో రెండు ఆస్తుల దస్తావేజులూ అధికారులు గుర్తించారు. ఈ రెండు లాకర్లను నాగరాజు భార్య స్వప్న వినియోగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా.. కీసర తహసీల్దార్ నాగరాజు రూ. 1.1 కోట్ల లంచం తీసుకుంటూ అవినీతి శాఖ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఆయన కొద్దిరోజుల క్రితం చంచల్ గూడ జైలులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

keesara former tahsildar, nagaraju lost life, nagaraju suicide, ex tahsildar, curruption case, telangana news, telugu news, telugu varthalu, నాగరాజు సూసైడ్, నాగరాజు ఆత్మహత్య, కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు,
కీసర మాజీ తాహసీల్దార్‌ నాగరాజు (File)


లంచం కేసు పూర్వాపరాలు :
మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్‌ 604 నుంచి 614 వరకు గల కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌ (గవర్నమెంట్‌ కస్టోడియన్‌ ల్యాండ్‌) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలపై ఓ వర్గానికి సపోర్ట్ చేస్తూ రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నాగరాజు రియల్‌ బ్రోకర్‌ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగరాజు ఖాతాలో ఇలాంటివి ఎన్నో పాపాలున్నాయి. అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తుల చిట్టా మొత్తం ఏసీబీ బయటకు లాగుతోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌ ఇలా వేర్వేరు పోస్టుల్లో పనిచేసిన నాగరాజు... అవినీతి అనకొండలా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Published by: Srinivas Munigala
First published: October 23, 2020, 7:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading