హోమ్ /వార్తలు /క్రైమ్ /

Tamil nadu: తమిళనాడులో సంచలనం.. మాజీ సీఎం పళనిస్వామి వర్గీయులపై ఏసీబీ దాడులు.. గవర్నర్​కు పళని ఫిర్యాదు

Tamil nadu: తమిళనాడులో సంచలనం.. మాజీ సీఎం పళనిస్వామి వర్గీయులపై ఏసీబీ దాడులు.. గవర్నర్​కు పళని ఫిర్యాదు

పళనిస్వామి, స్టాలిన్ (ఫైల్ ఫోటో)

పళనిస్వామి, స్టాలిన్ (ఫైల్ ఫోటో)

కొత్త కొత్త పథకాలతో దూసుకెళుతున్నారు స్టాలిన్​. అయితే ఇపుడు అక్కడి ప్రభుత్వం మరో సంచలనానికి తెర లేపింది. ఎన్నడూ లేనంతగా ఏసీబీ దాడులకు దిగింది. ఏసీబీ దాడులు ఏదో ఆషామాషీ వ్యక్తిపై చేయట్లేదు. ఏకంగా మాజీ సీఎం వర్గీయులపైనే జరగడం సంచలనం రేకేత్తించింది.

ఇంకా చదవండి ...

తమిళనాడు (Tamil nadu) వినూత్న రాజకీయాలకు ప్రసిద్ధి. దేశమంతా మోదీ (modi) గాలి వీచినా తమిళనాడులో ప్రాంతీయ వాదానికే పెద్దపీట వేశారు. అక్కడ భాషాభిమానం అంత ఎక్కువ మరి. ‘అమ్మ’ మరణం తర్వాత అక్కడ ఓ రకంగా రాజకీయ శూన్యత ఏర్పడింది. కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయని అనుకున్నారు.. అలాగే కమల్​హాసన్​ పార్టీ పెట్టారు.. కానీ, రజనీ వెనకడుగు వేశారు. అయితే కొన్ని నెలల కిందటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే పార్టీని కాదని.. డీఎంకే (DMK)కు ప్రజలు పట్టం కట్టారు. డీఎంకే అధినేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ (Stalin)​..  పళనిస్వామి (palani swamy)కి చెక్​ పెట్టి.. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. రావడం రావడమే.. సీఎం స్టాలిన్​ పాలనలో తన ముద్రను చూపిస్తున్నారు కూడా.. తను బయటికి వెళుతున్నపుడు ప్రజలు ఎక్కువగా వెళ్లే రహదారులు ఉపయోగించడం లేదు. వారికి ట్రాఫిక్​ కష్టాలు తన కాన్వాయ్​ వల్ల కాకూడదని.. అధికారికి వాహనాలు సైతం కొన్నింటిని తగ్గించారు. కొత్త కొత్త పథకాలతో దూసుకెళుతున్నారు స్టాలిన్​. అయితే ఇపుడు అక్కడి ప్రభుత్వం మరో సంచలనానికి తెర లేపింది. ఎన్నడూ లేనంతగా Directorate of Vigilance and Anti Corruption దాడులకు దిగింది. ఏసీబీ దాడులు ఏదో ఆషామాషీ వ్యక్తిపై చేయట్లేదు. ఏకంగా మాజీ సీఎం వర్గీయులపైనే జరగడం సంచలనం రేకేత్తించింది.

ఏడు చోట్ల తనిఖీలు..

డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ మరియు యాంటీ కరప్షన్ (Directorate of Vigilance and Anti Corruption) దాడులు (raids) కలకలం రేపుతున్నాయి. ఏకంగా మాజీ సీఎం పళనిస్వామి టార్గెట్‌గా DVAC ఎటాక్‌ చర్చకు దారితీసింది. పళనిస్వామి సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో అధికారులు ( Officials) సోదాలు చేస్తున్నారు. ఏకంగా ఏడు చోట్ల తనిఖీలు (search) కొనసాగుతున్నాయి.

ఏకకాలంలో దాడులు..

చెన్నై (Chennai), తిరుచ్చి, సేలం, నామక్కల్, కరూర్ జిల్లాల్లో ఈ దాడులు (raids) అవుతున్నాయి. ఏకకాలంలో దాడులు చేపట్టడంతో పళనిస్వామి వర్గీయులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పళనిస్వామి సొంత జిల్లా సేలం కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఇలం గోవన్ ఇంట్లోనూ సోదాలు కొనసాగాయి. మరో వైపు.. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు విజిలెన్స్​ అధికారులు. తిరుచ్చి, నామక్కల్ జిల్లాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో దాడులు చేపట్టారు. పలు రికార్డుల్ని (records) స్వాధీనం చేసుకున్నారు.

గవర్నర్​కు ఫిర్యాదు..

DVAC దాడులతో పళని వర్గం ఒక్కసారిగా అప్రమత్తమైంది. వాంటెడ్‌లీగా ఏసీబీ దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు పళనిస్వామి మద్దతుదారులు. స్టాలిన్‌ సర్కార్‌ ప్రతీకార చర్యలకు దిగుతోందని పేర్కొంటున్నారు. మాజీ సీఎంను టార్గెట్‌ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు మాజీ సీఎం పళనిస్వామి. ఈ సోదాలపై ఆయన రాష్ట్ర గవర్న్‌ర్‌ (governor) ఆర్​ఎన్​ రవి (RN. Ravi)కి ఫిర్యాదు చేశారు.

First published:

Tags: ACB, MK Stalin, Palanisami, Tamil nadu

ఉత్తమ కథలు