A YOUNG WOMAN WORKING AS AN HR IN A REPUTED COMPANY COMMITTED SUICIDE BY HANGING IN INDORE SSR
HR Manager: మూడేళ్ల నుంచి హెచ్ఆర్గా ఉద్యోగం.. మూడు రోజుల క్రితమే ఉద్యోగం మానేసింది.. పాపం ఇంతలోనే..
షాలూ నిగమ్ (ఫైల్ ఫొటో)
ఆ యువతి ఓ ప్రముఖ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా (HR Manager) పనిచేస్తోంది. మూడు రోజుల క్రితమే ఉద్యోగానికి రాజీనామా (Resignation) చేసింది. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో (Indore) చోటుచేసుకుంది.
ఇండోర్: ఆ యువతి ఓ ప్రముఖ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా (HR Manager) పనిచేస్తోంది. మూడు రోజుల క్రితమే ఉద్యోగానికి రాజీనామా (Resignation) చేసింది. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో (Indore) చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌కు చెందిన షాలూ నిగమ్ అనే యువతి ఓ ప్రముఖ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగం చేస్తోంది. దాదాపు మూడేళ్లుగా అదే కంపెనీలో ఆమె పనిచేస్తోంది. మంచి ఉద్యోగం. చెప్పుకోతగ్గ జీతం. షాలూ నిగమ్ సొంతూరు సత్నా. ఇండోర్‌లో ఉద్యోగం చేస్తూ తన చెల్లితో కలిసి ఉంటోంది. ఆమె చెల్లి కూడా ఉద్యోగం చేస్తోంది.
అక్టోబర్ 5న రోజూలానే ఆఫీస్‌కు వెళ్లి షాలూ నిగమ్ సోదరి రూమ్‌కు సాయంత్రం తిరిగి వచ్చేసరికి షాలూ నిగమ్ ఉరేసుకుని కనిపించింది. షాలూ అప్పటికే చనిపోయింది. ఊహించని ఘటనతో కుప్పకూలిపోయిన షాలూ చెల్లెలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. ఆమె ఏడుపులు విన్న ఇంటి ఓనర్ కుటుంబ సభ్యులు షాలూ ఆత్మహత్యపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని ఎంవై హాస్పిటల్‌కు తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన షాలూ అంతకు ముందు మూడు రోజుల క్రితమే తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినట్లు తెలిసింది.
తల్లిదండ్రులు ఈ ఘటనపై స్పందిస్తూ.. తమతో ఫోన్లో మాట్లాడిన సందర్భంలో ఆఫీస్ టెన్షన్ ఎక్కువైందని.. ఉద్యోగం చేయలేనని ఆమె చెప్పినట్లు తెలిపారు. తమ కూతురి ఆత్మహత్యకు ఆఫీస్‌లో ఎవరి వేధింపులో కారణం అయి ఉండొచ్చని ఆమె తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఇక.. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. అయితే.. అందులో ఆమె ఏం రాసిందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఈ కేసులో మరో పరిణామం ఏంటంటే.. షాలూ భర్త మన్‌పాల్ సింగ్ కూడా ఆమె పనిచేస్తున్న అదే ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు.
పోలీసులు అతనిని విచారించగా.. ఆఫీస్‌లో ఎలాంటి టెన్షన్ లేదని.. ఆమె ఎందుకు ఉద్యోగం వదిలేసిందో చెప్పలేదని తెలిపాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసు అధికారి అష్రఫ్ అలీ హన్సారీ మాట్లాడుతూ.. ఆత్మహత్యగా కేసు నమోదు చేశామని.. సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని.. విచారణ కొనసాగుతుందని తెలిపారు. సూసైడ్ నోట్ ఆమె ఏ విషయాలు రాసిందనే అంశం ఈ కేసులో కీలకంగా మారింది. ఆమె ఆత్మహత్యకు పని ఒత్తిడి కారణమా లేదా తనను ఆఫీస్‌లో ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.