Home /News /crime /

A YOUNG WOMAN WAS FOUND HANGING FROM A FAN IN A SUSPICIOUS CONDITION IN AN APARTMENT IN ATTAPUR CHINTALMET IN HYDERABAD PRV

Hyderabad: వారం రోజులుగా ఫ్లాట్​లోనే యువతి మృతదేహం.. దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి.. హైదరాబాద్​లో ఘటన.. 

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

హైదరాబాద్​ శివారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఆ యువతి మృతదేహం కనిపించింది. అత్తాపూర్ చింతల్‌మెట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

    హైదరాబాద్​ (Hyderabad) వారం రోజుల తర్వాత ఓ మృతదేహం (Dead body) వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.  నగర శివారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఆ యువతి మృతదేహం కనిపించింది. అత్తాపూర్ చింతల్‌మెట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఫ్లాట్ (Flat) నుంచి దుర్వాసన (Bad smell) రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోనికి వెళ్లి చూడగా యువతి వేలాడుతూ కనిపించింది. దీంతో డాగ్ స్క్యాడ్, క్లూస్ టీమ్‌ బృందాల సాయంతో ఆధారాలు సేకరించారు. మృతురాలిని బ్యూటీషియన్ అర్యాన్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు.

    బాయ్​ఫ్రెండ్​ పరారి..?

    ఆ ఫ్లాట్‌లో ఆమెతో పాటు మరో యువకుడు ఉంటున్నాడని, వారిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆ యువకుడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ప్రియుడే చంపేసి అలా క్రియేట్ చేశాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే యువతి గదిలో వారం క్రితం పుట్టినరోజు వేడుకలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్యాన్ ఖాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతురాలి ప్రియుడు దొరికితే ఈ కేసులో ఓ క్లారిటీ వచ్చే అశకాముందని పోలీసులు చెబుతున్నారు.

    విశాఖలోనూ..

    ఇటీవలె విశాఖలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్టణం జిల్లా అనకాపల్లికి చెందిన కే రాజశేఖర్ అనే 32 ఏళ్ల కుర్రాడు చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. పీజీ కూడా చేయాలన్నది అతడి కల. అయితే అతడి కల కలగానే మిగిలిపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో తిరిగి విశాఖకు వచ్చేశాడు.

    కనీసం అనకాపల్లిలోనే పీజీ చేయాలనుకున్నా కుదరలేదు. తండ్రి కూడా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అతడు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. తన కల నెరవేరడం లేదని పదే పదే స్నేహితులతో చెప్పి బాధపడేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మధురవాడ గణేష్ నగర్ లో ఉంటున్న స్నేహితుడు సుబ్బరాజు ఉండే ఫ్లాట్ కు వచ్చాడు. అయితే ఆ సమయంలో సుబ్బరాజు ఫ్లాట్ లో లేడు. దీంతో అతడికి ఫోన్ చేశాడు.

    ‘ నేను వచ్చేసరికి ఇంకా రెండు మూడు గంటలయినా పడుతుంది. ఈ లోపు ఫ్లాట్ లోనే ఉండు. కిటికీని నెడితే అక్కడ తాళం కనిపిస్తుంది. లోపలకు వెళ్లి టీవీ చూస్తూ ఉండు. ఆకలి అయితే భోజనం కూడా ప్రిపేర్ చేసే ఉంది. పెట్టుకుని తిను.’ అంటూ సుబ్బరాజు చెప్పాడు. దీంతో రాజశేఖర్ తాళం తీసుకుని లోపలకు వెళ్లాడు.

    సరిగ్గా 11 గంటల సమయంలో సుబ్బరాజు ఫ్లాట్ కు తిరిగి వచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టినా, ఎన్నిసార్లు స్నేహితుడిని పిలిచినా డోర్ తీయలేదు. రాజశేఖర్ కు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అతడిలో కాస్త భయం కలిగింది. కిటికీలోంచి చూస్తే ఎవరూ కనిపించలేదు. ఇంట్లో ఏ అలికిడీ లేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలకు వెళ్లి చూస్తే వారికి ఓ షాకింగ్ సీన్ కనిపించింది. ఫ్యాన్ కు ఉరి వేసుకుని రాజశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని కిందకు దించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Dead body, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు