పాములు (Snakes) పగపడుతాయా లేదా అనే వాటికి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తుంటారు. పాములు ఒకరిపై పగపడితే (Snakes Revenge)... సదరు వ్యక్తి చనిపోయే వరకూ వేటాడుతూనే ఉంటాయని కొందరు అంటుంటే.. పాములకు ఏమాత్రం జ్ఞాపక శక్తి ఉండదని హేతువాదులు ఖండిస్తున్న పరిస్థితి. సినిమాలలో అయితే పాములు పగబట్టినట్టు చూశాం.. ఎక్కడెక్కడో జరిగినట్టు వింటాం కానీ.. స్థానికంగా అట్లాంటి ఘటనలేవీ మన కళ్ల ముందు జరిగిన దాఖలాలు లేవు. కానీ, ఆదిలాబాద్ (Adilabad)లో పాము రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను మూడు సార్లు వెంటాడింది. ఏడునెలల వ్యవధిలో పాము మూడు సార్లు ఆమెను కాటేసింది (she had been bitten three times by snakes in the past seven months.). అయితే.. పాము కాటుకు గురైన ఆమె రెండు సార్లు కోలుకున్నా.. మూడో సారి ఆమె విధికి తలొంచాల్సి వచ్చింది.
డిగ్రీ చదువుతున్న యువతి..
పాము కాటు (Snake bite)తో యువతి మృతిచెందిన విషాద ఘటన ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బేల మండలం బెదోడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భలేరావు సుభాష్ దంపతుల ఏకైక కుమార్తె ప్రణాళి (18). ఆమె ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే.. గతేడాది సెప్టెంబరులో ఇంట్లో నిద్రిస్తుండగా చేతిపై పాము కాటు (Snake bites a girl) వేసింది. అప్పుడు దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసి ఆమెను తల్లిండ్రులు బతికించుకున్నారు. రెండోసారి ఈ ఏడాది జనవరిలో ఇంటి ఆవరణలో కూర్చొని ఉండగా పాము కాటువేసింది (Snake bites a girl). సకాలంలో చికిత్స అందించడంతో తిరిగి కోలుకుంది.
రెండుసార్లు పౌర్ణమి రోజున, ఒకసారి అమావాస్య రోజున..
శుక్రవారం హోలీ పండగ రోజు స్నేహితులతో హోలీ (Holi) ఆడుకునేందుకు ప్రణాళి సిద్ధమైంది. ఈ క్రమంలో ఇంట్లో బ్యాగులోని రంగులను తీయబోతుండగా అందులో నక్కి ఉన్న పాము ఒక్కసారిగా ఆమెను కాటు వేసింది (Snake bites a girl). వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన రిమ్స్ (Rims)కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరణించింది. ఒక్కగానొక కుమార్తె చనిపోవడంతో కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. అయితే.. ప్రణాళిని రెండుసార్లు పౌర్ణమి రోజున, ఒకసారి అమావాస్య రోజున పాము కాటేసిందంటూ (Snake bites a girl) కుటుంబసభ్యులు పేర్కొనడంతో చుట్టుపక్కల వాళ్లు ఇదేదే పాము పగబట్టినట్లు ఉందని చర్చించుకుంటున్నారు.
గతంలో ఏపీలోనూ ఇలాగే జరిగింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) తిరుపపతి సమీపంలోని ధోర్ణకంబాల ఎస్టీకాలంలో వెంకటేష్ వెంకటమ్మ కుటుంబీకులు ఒకరి తర్వాత ఒకరు పాము కాటుకు గురవడం జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Snake bite, Telugu girl, Young age died